తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మెషిన్‌ను సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా …
Read More »తిరుమల ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో అరుపులు, కేకలు.. భయపడిపోయిన భక్తులు
తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు రెచ్చిపోయారు. తిరుమల రెండో ఘాట్ రోడ్‌లో కార్ డోర్ తీసి సన్‌రూఫ్, సైడ్ విండోల నుంచి బయటకు నిలబడి పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశారు. వర్షంలో యువకులు కారులో బయటకు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు.. దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. యువకుల చేష్టలు చూసి వాహనాల్లో వెళుతున్న భక్తులు అవాక్కయ్యారు.. ఈ యువకుల ఆగడాలను రికార్డ్ చేశారు. ఘాట్ రోడ్డులో హంగామా చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …
Read More »Tirupati Laddu Row: నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. ఏఆర్, వైష్ణవి డెయిరీలతో పాటు తిరుమలలో కూడా తనిఖీలు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనపై సిట్ విచారణ షురూ చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణలో దూకుడు పెంచారు సిట్ అధికారులు. శ్రీవారి ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. లడ్డు బూందీ పోటులో సోదాలు చేశారు. లడ్డూ బూందీకి వినియోగించే నెయ్యిని పరిశీలించారు. గత జగన్ ప్రభుత్వంలో వాడిన నెయ్యిపై ఆరా తీశారు. వినియోగించే నెయ్యి నాణ్యత గురించి విచారణ బృందం అడిగి తెలుసుకుంది. రోజూ ఎంత నెయ్యి వినియోగిస్తారు? ఎక్కడ నుంచి తీసుకొస్తారంటూ? అక్కడి అధికారుల నుంచి సమచారం రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే …
Read More »తిరుమలలో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం.. త్వరలో అన్నిసేవలకు ఆధారే ఆధారం..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పాపాలను పోగొట్టుకునిసద్గతి పొందాలని భక్తులు భావిస్తారు. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేస్తారు. అటువంటి పవిత్ర పుణ్య క్షేత్రం కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అవినీతి పనులు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో ముదస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న …
Read More »తిరుపతి: 150 గంటల్లోనే భారీ భవన నిర్మాణం పూర్తి.. ప్రపంచ రికార్డ్, ఈ టెక్నాలజీ అదిరింది
ఓ పరిశ్రమను నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది.. కనీసం ఆరునెలల నుంచి ఏడాది మాత్రం పక్కా. తిరుపతి జిల్లాలో మాత్రం అలా కాదు.. కేవలం 150 గంటల్లో ఏకంగా లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. తిరుపతి జిల్లాలోని తడ సమీపంలోని మాంబట్టు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణ సంస్థ ఈప్యాక్ ప్రీఫ్యాబ్ ఈ పరిశ్రమను నిర్మించింది. కేవలం 150 గంటల్లోనే ఒక భారీ పరిశ్రమను నిర్మించి రికార్డు సృష్టించారు. …
Read More »మూడు నెలల్లో తిరుమలలో ఆ సమస్యకు చెక్.. టీటీడీ ఈవో హామీ
టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును టీటీడీ ఈవో తొలుత పరిశీలించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమలలో 30 ఏళ్ల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. దీని వలన అనేక …
Read More »తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు
తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 ఫిబ్రవరి నెల కోటాను ఇవాళ (నవంబర్ 18న) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము …
Read More »TTD Board Decisions: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. మూడు గంటల్లోనే దర్శనం!
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత …
Read More »