విశాఖపట్నం

ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. రైల్వే జోన్‌పై మరో ముందడుగు, రెండేళ్లలో పూర్తి

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. నగరంలోని ముడసర్లోవ ప్రాంతంలో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ భవన సముదాయానికి సంబంధించిన డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఈ భవన సముదాయాన్ని బీ1+బీ2+జీ+9 (బేస్‌మెంట్‌ 1, 2, గ్రౌండ్, మొత్తం 9 ఫ్లోర్లు)గా నిర్మించాలని నిర్ణయించారు.. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు డీపీఆర్‌లో డిజైన్ ఆకట్టుకుంది. ఈ భవనాన్ని మొత్తం 27,548.3 …

Read More »

విశాఖ: రూ.1500కు కొనుగోలు చేసి రూ.25 వేలకు అమ్మకం.. ఐదేళ్లుగా నడుస్తోంది, పెద్ద ప్లానింగే

ఉత్తరాంధ్ర టు హైదరాబాద్.. అక్కడ తీగ లాగితే ఇక్కడ డొంక మొత్తం కదిలింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ దందాపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో డొంక కదిలింది.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బాలాజీ గోవింంద్‌‌ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.. వారిని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బాలాజీ గోవింద్ …

Read More »

విశాఖ: ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా!

విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ …

Read More »

అల్లూరి జిల్లా: 18మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన మహిళా అధికారి.. ఆ చిన్న కారణానికే ఇలా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో విద్యార్థినుల జుత్తును ప్రత్యేక అధికారిణి కత్తిరించారు. జి.మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను …

Read More »

విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు

నలుగురు వ్యక్తలు రూ.500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగారు.. పోనీలే అని సాయం చేద్దామని.. రూ.500 నోటు తీసుకుని చిల్లర ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఊహించని ట్విస్ట్‌తో చిల్లర ఇచ్చి సాయం చేసిన వాళ్లు అవాక్కయ్యారు.. సీన్ కట్ చేస్తే పెద్ద మోసమే జరిగింది. ఇలా అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలంరేపింది. ఇద్దర్ని అమాయకుల్ని చేసి నకిలీ నోట్లు అంటగట్టారు నలుగురు యువకులు. ఈ నెల 16న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన విశాల్, …

Read More »

ఏపీ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట.. 14 ఏళ్ల తర్వాత ఏకంగా రూ.650 కోట్లు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట దక్కింది. గత పదిహేనేళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకొని న్యాయవివాదంలో ఉండిపోయిన సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు హైకోర్టు తీర్పుతో తిరిగి దక్కాయి. ఈ భూముల విలువ ఏకంగా సుమారు రూ.650 కోట్లని చెబుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సింహాచలం ఆలయ అధికారులకు ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధంగా కాశీవిశ్వేశ్వరస్వామి కోవెల ఉంది. ఈ ఆలయానికి సర్వే నంబర్లు 3/1, 3/4లలో 99.20 …

Read More »

విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. బీచ్ రోడ్‌లో 24 అంతస్థుల భారీ స్కై స్క్రాపర్

విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా అనే సంగతి తెలిసిందే. విశాఖ బీచ్, అరకు అందాలను చూడటానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వైజాగ్ వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి విశాఖ వస్తోన్న పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక సదస్సులకు కూడా నగరం వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఫైవ్ స్టార్ …

Read More »

 ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టడం ఏంటి?.. చాలామంది ఎగిరిపోతారు.. 

ఓ వ్యక్తి విలాసాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు..సీఎం చంద్రబాబు. జగన్‌ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను..ముఖ్యమంత్రి పరిశీలించారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చని జగన్‌ ప్రభుత్వం..ప్యాలెస్‌ కోసం 430 కోట్లు ఖర్చుచేసిందని ఆరోపించారు. ప్రజల నుండి వచ్చే సూచనల మేరకే రుషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రుషికొండ భవనాల నిర్మాణం ముమ్మాటికీ నేరమే అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. భవన నిర్మాణాల తీరు.. నిబంధనల ఉల్లంఘనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో …

Read More »

నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు

సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్‌ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు …

Read More »

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 4 గంటల్లోనే.. కొత్త రైలు మార్గం, ఈ రూట్‌లోనే!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి సంబంధించి.. రెండు ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం తగ్గనుంది. విశాఖపట్నం-శంషాబాద్‌ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖాయమైంది. ఈ మార్గాన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ప్రతిపాదన చేశారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విశాఖపట్నం నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు వరకు ఉంటుంది. ఈ …

Read More »