వైఎస్సార్

వైఎస్ జగన్ సొంత జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. ఢిల్లీలోని కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన పవన్ కళ్యా్ణ్.. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ సహా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు.. భేటీ అనంతరం …

Read More »

వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు, ఎందుకంటే

ఏపీలో సంచలన రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి.. పీఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ సమక్షంలో ఇవాళ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 2021లో కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. తాజాగా కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ఇప్పుడు వాంగ్మూలం రికార్డు …

Read More »

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే సోదరులు!

కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో వైఎస్సార్‌సీపీ నేతలు భేటీ అయ్యారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చిన్నాన్న గోపాల్‌రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి, ఆయన సోదరుడు మండల పరిషత ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ భేటీ అయ్యారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచలు, వారి వర్గీయులు సుగవాసిని ఘనంగా సత్కరించారు. ఆకేపాటి బ్రదన్స్ సుగవాసిని కలవడం రాజంపేట నియోజక వర్గంలో పెద్ద …

Read More »

‘బెదిరిస్తున్నావా.. నా ఇంటికి రా.. వాళ్లు చెబితేనే చేశా’ భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్

నంద్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, విజయ పాల డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. నంద్యాల విజయ డెయిరీకి వెళ్లిన ఆమె.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న శిలాఫలకాన్నే కాలువలో పడేయడంపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నంద్యాలలో పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని ప్రారంభించిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇప్పుడు తొలగించి కాలువపై వేయడంపై మండిపడ్డారు. …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి.. ఏరి కోరి మరీ, ఎవరీ ఆకుల వెంకటరమణ!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరులశాఖలో మంత్రి నారా లోకేష్‌ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా బదిలీ కాగా.. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా …

Read More »

ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …

Read More »

జమ్మలమడుగులోని పొలాల్లో సిరంజీల కలకలం.. 

కడప జిల్లా జమ్మలమడుగులో సిరంజీలు కలకలంరేపాయి. జమ్మలమడుగు బైపాస్‌ నుంచి శేషారెడ్డిపల్లె వెళ్లే మార్గంలో పొలాల గట్ల వెంట వాడి పడేసిన సిరంజీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రైల్వే గేటు దాటగానే రోడ్డు పక్కన 2.5 ఎం.ఎల్‌ సిరంజీలు సూదితో సహా గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పొలాల్లో, గట్లపై ఈ సిరంజీలు ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరంజీలు రక్త పరీక్షలవా? మత్తు పదార్థాల కోసం వాడినివా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటి సిరంజీలు ఎప్పుడూ చూడలేదని రైతులు, …

Read More »

ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …

Read More »