ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. పేదల కడుపు నింపాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు మూతపడగా.. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అన్న క్యాంటీన్లు తీసుకువచ్చారు. గురవారం పంద్రాగస్టు సందర్భంగా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఆగస్ట్ 16న రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాలలో ఉన్న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, …
Read More »పవన్ కళ్యాణ్ -ఆద్యల క్యూట్ ఫొటో.. రేణూ దేశాయ్ రియాక్షన్ వైరల్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కుమార్తె ఆద్య కూడా హాజరైంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తన కూతురితో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోపైనే రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆద్య అర్థం చేసుకుంటుంది “స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో …
Read More »సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో ఇక్కడ కూడా, ఇకపై ఈజీగా
సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో దిగ్విజయంగా కొనసాగుతున్న నిత్య అన్నప్రసాద పథకానికి విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సింహాద్రి అప్పన్న స్వామి నిత్యాన్నప్రసాద పథకం 35వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నప్రసాద పథకానికి సాధారణ భక్తులు సైతం విరాళాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. సింహాచలం ఆలయం అన్నదానం భవనం దగ్గర కార్డు స్వైపింగ్ పరికరాలు, డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. …
Read More »ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు
ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో …
Read More »తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు
తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత కాసుల వర్షం కురిసింది. కొన్ని నెలల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది.. చాన్నాళ్లకు స్వామివారి హుండీ ఆదాయం ఒక్క రోజులో రూ.5కోట్ల మార్కును దాటేసింది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,967మంది భక్తులు దర్శించుకున్నారు.. 32,421మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే 5.26 కోట్లు ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టికెట్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 …
Read More »జగన్ ఆస్తుల కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలుచేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్‌కుమార్ తప్పుకొన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని తెలిపింది. …
Read More »ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా వారందరికి హైకోర్టు నోటీసులు.. మళ్లీ ఇదేం ట్విస్ట్!
పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పెద్దిరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా రామచంద్రారెడ్డి, ఇతర పార్టీల అభ్యర్థులు, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.
Read More »అన్ని సేవలూ ఒకే యాప్‌లో.. చంద్రబాబు సరికొత్త ఆలోచన..
పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన …
Read More »రేపే అన్న క్యాంటీన్ల ప్రారంభం.. నారా భువనేశ్వరి భారీ విరాళం.. ఎంతో తెలుసా?
Nara Bhuvaneswari Donation for Anna canteens: పంద్రాగస్టును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ …
Read More »టీడీపీ నేత పోస్టుతో ఆగిన ఐఏఎస్ పోస్టింగ్?.. ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి డి. హరితకు ఇచ్చిన పోస్టింగ్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డి. హరితను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆమె ఇంకా జేసీగా రిపోర్టు చేయలేదు. అయితే ఈ లోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పోస్టింగ్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. హరితను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు …
Read More »