ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఈ పింఛన్లు తీసుకునేవారికి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యమలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, థలసేమియా, లెప్రసీ, సీవియర్‌ హీమోఫిలియా వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇలా …

Read More »

Nadendla Manohar: ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నిత్యావసరాల ధరలు తగ్గించిన ప్రభుత్వం

 నిత్యావసరాల పెరుగుదలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. వంటింట్లో రోజూ ఉపయోగించే కందిపప్పు, బియ్యం, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయాన్ని.. ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలె ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి నిత్యావసరాల ధరలను తగ్గించిందని గుర్తు చేసిన మంత్రి నాదెండ్ల.. తాజాగా మరోసారి తగ్గింపు …

Read More »

ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా.. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …

Read More »

ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్‌ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.. …

Read More »

కేంద్రం నుంచి ఏపీకి తీపికబురు. 

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్‌ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం …

Read More »

ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు …

Read More »

పోలీసులకు గుడ్ న్యూస్.. హోం మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు. పోలీసులకు వీక్ ఆఫ్‌లు, సరెండర్ లీవ్‌లకు నిధులపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై అన్ని జిల్లాల ఎస్పీలతో హోంశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు వంగలపూడి అనిత గుడ్ న్యూస్ వినిపించారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వైసీపీ …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై అలేఖ్య తారకరత్న.. 

అలేఖ్య తారకరత్న తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. తన బర్త్ డే సందర్భంగా అలేఖ్య అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలయ్య బాబు విష్ చేశాడా? అని ఓ నెటిజన్ అడిగితే.. విష్ చేయలేదు.. ఆయన బిజీగా ఉండి ఉంటారు అని సమాధానం ఇచ్చేసింది. ఇక విజయ సాయి రెడ్డి మీద వస్తోన్న రూమర్ల మీద, నందమూరి కుటుంబం దూరం పెట్టడం.. నారా లోకేష్ ఆర్థిక సాయం ఇలా అనేక అంశాల మీద అలేఖ్య సమాధానం చెప్పింది. …

Read More »

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. జులై నెలాఖరుకు వచ్చిన నేపథ్యంలో ఆగస్ట్ నెలలో పింఛన్ల పంపిణీకై టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్ట్ నెల ఒకటో తేదీనే 99 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. తొలి రోజే 99 శాతం మందికి …

Read More »

ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …

Read More »