నెల్లూరు: ఈ మహిళ ఎంతో లక్కీ.. బంగారం మొత్తం, ఆర్టీసీ బస్సులో ఆసక్తికర ఘటన

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును జాగ్రత్తగా తిరిగి అప్పగించారు. ఆదివారం రోజు అల్లూరులో శ్రీహరికోట కుమారి ఆర్టీసీ బస్సు ఎక్కారు.. అయితే తన స్టాప్‌లో బస్సు దిగిపోయే సమయంలో ఆమె తన పర్సును సీట్‌లో మర్చిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆర్టీసీ బస్ కండక్టర్ వెంకయ్య పర్సును గమనించారు.. తీసి చూడగానే బంగారం, డబ్బులు కనిపించాయి. వెంటనే ఈ సమాచారాన్ని డిపో మేనేజర్‌కు అందించారు.

ఆ మహిళ పర్సును తీసుకెళ్లి జాగ్రత్తగా డిపోలో అప్పగించారు. ఆర్టీసీ డిపో అధికారులు సదరు మహిళ వివరాలు సేకరించి సమాచారం పంపారు. సోమవారం ప్రయాణికురాలు డిపోకు రాగా.. మేనేజర్ చేతుల మీదుగా పర్సును తిరిగి ఆమెకు అప్పగించారు. ప్రయాణికురాలు పర్సులో ఉన్న ఆభరణాల వివరాలు సరిగ్గా ఉన్నాయని చెప్పారు. బస్సులో దొరికిన పర్సును జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగించి నిజాయితీ చాటుకున్న కండెక్టర్ వెంకయ్యను ఆర్టీసీ అధికారులు, స్థానికులు అభినందించారు. అలాగే ప్రయాణికురాలు కూడా కండక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆమె పోగొట్టుకున్న పర్సులో రూ.లక్ష విలువచేసే బంగారం, రూ.4వేలు డబ్బులు ఉన్నాయి.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *