ఆంధ్రప్రదేశ్

జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మల భేటీలో మరో ట్విస్ట్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది. విజయమ్మ యోగ క్షేమాల గురించి అడిగి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి …

Read More »

అన్నవరం ఆలయానికి భక్తుడి ఖరీదైన కానుక.. అమ్మవారికి వజ్ర కిరీటం, ఏకంగా రూ.కోట్ల విలువ

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఓ భక్తుడు భారీ కానుకను అందజేశారు. సత్యనారాయణస్వామివారి దేవేరి అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటాన్ని అందజేశారు. పెద్దాపురం శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు దాదాపు రూ.కోటిన్నరతో (కిలో బంగారం, 130 క్యారెట్ల వజ్రాలతో) ఈ కిరీటాన్ని అమ్మవారికి తయారు చేయించారు. అలాగే స్వామి, అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను కూడా తయారు చేయించి అందజేశారు. ఆగస్టు 6న సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ పర్వదినం రోజున అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. …

Read More »

జనసేన పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. కారు ధ్వంసం, పవన్ కళ్యాణ్ సీరియస్

ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరారు.. ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని.. తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిత్యం చర్యలు చేపడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే దర్శన టికెట్ల దగ్గర నుంచి, శ్రీవారి అన్న ప్రసాదం, బస వరకూ అనేక చర్యలు చేపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్టు భక్తులకు దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కౌంటర్ ఏర్పాటు కోసం స్థలాన్ని …

Read More »

ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గృహ నిర్మాణ శాఖపై సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్థసారథితో కలిసి ఆయన గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల పంపిణీలో చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో …

Read More »

జనసేన పార్టీ సరికొత్త రికార్డ్.. అంతకు మించి..?

జనసేన పార్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభంకాగా.. ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. మరో వారం పాటూ సభ్యత్వ నమోదుకు గడువును పెంచామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. జనసేన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించి.. ప్రతి నియోజకవర్గంలోనూ 5 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు. గత ఏడాది …

Read More »

పులులను వేటాడితే తాట తీస్తాం.. పవన్ కళ్యాణ్ వార్నింగ్

పులులను వేటాడితే తాట తీస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని.. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుందని పవన్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నల్లమలలో …

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..

ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో.. 12వ పీఆర్‌సీ కమిషనర్‌ని నియమించాలని కోరారు.. త్వరగా ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం హయాంలోని భూ ఆక్రమణలపై ఇవాళ కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రధానంా …

Read More »

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. కాకినాడలో ఆ చెట్టు కనిపిస్తే చాలు ఖతమే..

కాకినాడ జిల్లాలో ఆ మొక్క కనిపిస్తే చాలు.. అధికారులు కస్సుమంటున్నారు. కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తున్నారు. ఏంటా.. ఎందుకా కోపం అనుకుంటున్నారా.. ఆ మొక్క వలన సమాజానికి కీడే తప్ప మేలు లేదనే ఉపయోగంతో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో కోనోకార్పస్ చెట్లను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 35 వేలకు పైగా ఈ కోనో కార్పస్ చెట్లు ఉన్నట్లు లెక్కలు …

Read More »

 ఏపీ మంత్రి స్వామికి గాయాలు.. ఎద్దులు ఎంత పనిచేశాయి

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ కొలుపులు (తిరుణాళ్లు) నిర్వహించారు.. మంత్రి, టీడీపీ నేతలు ఈ వేడుకకు హాజరుకాగా.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నేతలు, మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ఎద్దులు బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. ఈ ఘటనలో మంత్రి స్వామి ముందుకు బోర్లా పడిపోగా.. ఆయన్ను ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది. వెంటనే …

Read More »