ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఛైర్మన్‌గా ఎవరూ ఊహించని వ్యక్తి.. ఏపీ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ వైరల్, 25మందికి పదవులు!

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే అధికారికంగా జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురికి నామినేటెడ్ పోస్టులు ఖాయం అయ్యాయంటూ ఓ జాబితా వైరల్ అవుతోంది. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల పేర్లుో ఈ లిస్టులో ఉన్నాయి. టికెట్ దక్కని నేతలు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి ప్రాధాన్యం …

Read More »

జగన్.. నీకా అర్హత లేదు.. కేసీఆర్‌తో కుమ్మక్కై నాశనం చేశావ్: గొట్టిపాటి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి ప్రశ్నించిన వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్‌కు లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది వైఎస్ జగన్‌నేనని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్.. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు. అప్పటి …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వమే ఉచితంగా, మంత్రి కీలక ప్రకటన

ఏపీలో డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. త్వరలో డీఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని.. అన్ని జిల్లా కేంద్రాల్లో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్‌ విదేశీ విద్య పథకంతోపాటు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ అధికారులతో మంత్రిమ సెమినార్, సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి …

Read More »

ఏపీకి కేంద్రం నుంచి తీపి కబురు.. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత, కష్టకాలంలో బిగ్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుంచి తీపికబురు అందింది. రాష్ట్రానికి సాకి (స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) కింద నిధులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తొలి విడతగా రూ.1,500 కోట్లు విడుదల చేశారు.. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఏయే మార్గాల్లో నిధులు రాబట్టాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల …

Read More »

అన్న క్యాంటీన్లకు మరో భారీ విరాళం.. చెక్కు లోకేష్‌కు ఇచ్చిన టీడీపీ యువ నేత

ఏపీలో పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు భారీగా వస్తున్నాయి. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ శిష్ట్లా లోహిత్ ను అభినందించారు. లోహిత్ ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ గా సమర్థవంతమైన …

Read More »

గ్రామసభల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శాఖాపరమైన విషయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. శాఖల గురించిన సమాచారం తెలుసుకోవటంతో పాటుగా పాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల కోసం ఈ నెలాఖర్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 23 నుంచి గ్రామ సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ సభల నిర్వహణ, విధివిధానాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …

Read More »

నకిలీ టికెట్లతో తిరుమల దర్శనం.. 4 టికెట్లకు రూ.11 వేలు.. సిబ్బంది చేతివాటం

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది తిరుపతికి వస్తారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోగా.. చాలా మంది సర్వదర్శనానికే వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే సర్వదర్శనానికి 24 గంటల సమయం కూడా పడుతుంది. అయితే టికెట్ బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు.. తిరుమలలో రద్దీ చూసి భయపడి దళారులను ఆశ్రయించి.. అధిక ధరలకు టికెట్లు కొంటూ ఉంటారు. కొన్నిసార్లు నకిలీ టికెట్లు కొని మోసపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా భక్తుల వీక్‌నెస్‌ను …

Read More »

ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నెరవేరనున్న ఏళ్ల నాటి కల.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Railway Zone: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ.. ఏపీలో తిరుగులేని సీట్లతో అధికారంలోకి రావడంతో.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. ఒకప్పుడు అవన్నీ కలలుగానే ఉండగా.. రెండోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడిప్పుడే అవన్నీ ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వేజోన్‌ ఏర్పాటు కానుందని రైల్వేశాఖ మంత్రి …

Read More »

నలుగురి ప్రాణం తీసిన కలుషితాహారం.. రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితహారం తిని నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి …

Read More »

ఏపీలోకి ఫాక్స్‌కాన్!.. నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల చర్చలు

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా …

Read More »