ఆంధ్రప్రదేశ్

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు…కమాన్‌, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల …

Read More »

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో పాటు పొరపాటున జరిగితే క్షణాల్లో నిందితులను పట్టుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీతో విజయనగరం టూ టౌన్ పోలీసులు చేపట్టిన విధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీస్ స్టేషన్లకి రోల్ మోడల్ గా మారింది. ఇదే విధానాన్ని ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా అమలుచేసే యోచనలో ఉన్నారు ఆయా జిల్లాల పోలీస్ బాసులు.ఇటీవల కాలంలో …

Read More »

విశాఖ జీవీఎంసీ పీఠం కైవసం చేసుకున్న కూటమి..

విశాఖ మేయర్‌ పీఠాన్ని కూటమి పార్టీ కైవసం చేసుకుంది.  అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన 74మంది ఓటేశారు. కోరమ్‌ సరిపోవడంతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మేయర్‌ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. అయితే.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కాగా.. రేపు కూటమి కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోనున్నారు. విశాఖ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్‌ నిర్వహించారు అధికారులు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో.. ఎమ్మెల్యే వంశీ కృష్ణ రాజీనామాతో 21వ డివిజన్‌ స్థానం …

Read More »

ఆ విషయంలో కూటమి నేతలైనా ఉపేక్షించబోం.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. త్వరలోనే..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లి కబ్జాలు, దందాలపై అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు. తానే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్, జేసీల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా అంటూ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో భూ దందా బాధితులతో మాట్లాడుతానంటున్నారు. బాధితుల ఫిర్యాదులు పరిశీలిస్తానంటున్నారు. బాధితుల బాధలు తెలుసుకొని, పరిష్కారానికి భరోసా ఇస్తా అంటున్నారు. తన పర్యటనలో భాగంగా ముందు కాకినాడ, విశాఖపట్నం వెళ్లాలని పవన్ నిర్ణయించారు. భూ …

Read More »

మొన్న MBBS.. నేడు ఇంజనీరింగ్‌.. ప్రాంతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాల ముద్రణ షురూ!

గతంలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలు, మెడికల్ విద్యను ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజినీరింగ్‌ విద్యలోనూ పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే కార్యచరణ ప్రారంభించారు కూడా. తద్వారా ప్రాథమిక, హైస్కూల్‌ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో …

Read More »

యువనేతకు అరుదైన గుర్తింపు.. గ్లోబల్ యంగ్ లీడర్‌‌గా రామ్మోహన్ నాయుడు..!

భారతదేశపు అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.. 2025 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) గ్లోబల్ యంగ్ లీడర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈ జాబితాలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత చైతన్యవంతమైన, దూరదృష్టి గల నేతగా నిలిచారు. ప్రభావవంతమైన మార్పుని కలిగించే వినూత్న పాలన ఉద్దేశ్యంతో ప్రజా సేవలో …

Read More »

లిక్కర్ స్కామ్ కేసులో సిట్‌ దూకుడు.. ఇవాళ విచారణకు విజయసాయి రెడ్డి!

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సాక్షిగా ఇవాళ విచారణకు హాజరుకావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈనెల 15న సిట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే 17వ తేదీనే సిట్‌ విచారణకు హాజరవుతానన్న విజయసాయి రెడ్డి..చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు వస్తానంటూ మరోసారి సిట్‌కి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన సిట్‌ ముందు విచారణకు …

Read More »

వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. దరఖాస్తు విధానంలో కీలక మార్పులు చేసిన విద్యాశాఖ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదలకు రూట్ క్లియర్‌ అవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన సర్కార్.. రాజప్రతిని గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించారు. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెడితే ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తైనట్లే. ఆ మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. అయితే డీఎస్సీ దరఖాస్తు విధానంలో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ, బీ విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. …

Read More »

డబ్బుంటే చాలదు.. కష్టం చూసి స్పందించే మనసుండాలి.. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ గిరిజనుల మోముల్లో ఆనందం..!

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ అడవి తల్లి బాట ‘ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ గ్రామస్తులతో మాట్లాడారు వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలోనే.. పవన్ కళ్యాణ్ గిరిజనుల ఆ కష్టాన్ని చూసి చలించిపోయారు. వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం.. రహదారుల మాట …

Read More »