ఆంధ్రప్రదేశ్

హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పవన్ రియాక్షన్ ఇదే..

తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించిన విజయ్.. ఆదివారం టీవీకే మహానాడును నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన టీవీకే పార్టీ మొదటి మహానాడుకు అశేష జనవాహిణి హాజరైంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తమ పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి రావటానికి కారణాలను విజయ్ వెల్లడించారు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విజయ్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో …

Read More »

తుని ఆర్టీసీ డ్రైవర్‌కు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్.. మరో బంపరాఫర్ ఇచ్చారు

కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే ఈ …

Read More »

రాజమహేంద్రవరంవాసులకు సూపర్ న్యూస్.. గోదావరి నదిలో విహరిస్తూ రెస్టారెంట్‌లో ఫుడ్ తీనొచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజమహేంద్రవరం వాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గోదావరిపై బోటుపై విహరిస్తూ.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఈ అనుభూతిని ప్రజలకు అందించేందుకు సరికొత్తగా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక దగ్గర ఈ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌‌ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. పర్యాటకులు, స్థానికులు రాజమహేంద్రవరం పద్మావతి ఘాట్‌ సమీపంలోని …

Read More »

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పీఆర్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్‌ …

Read More »

నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు

సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్‌ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు …

Read More »

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే

సరస్వతి పవర్ భూముల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలోని సరస్వతి భూములలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. అటవీశాఖ దాచేపల్లి సెక్షన్ డిఆర్ఓ విజయలక్ష్మి, ఎఫ్‌బిఓ వెంకటేశ్వరరావు అటవీ శాఖ సిబ్బందితో కలిసి మాచవరం, చెన్నైపాలెం, వేమవరం గ్రామాల్లో జీపీఎస్ సర్వే చేశారు. అటవీ భూములు ఏమైనా సరస్వతి పవర్ భూముల్లో కలిశాయా అనే విషయమై సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను …

Read More »

ఏపీలో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి, లైసెన్స్‌ తీసుకునేవారికి శుభవార్త.. మళ్లీ పాత పద్ధతి అమలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి.. లైసెన్స్ తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లెసెన్సు తీసుకునేవారికి అందించే డీఎల్ కార్డులు మళ్లీ జారీ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ స్మార్ట్ కార్డులను అందించే విధానాన్ని పక్కన పెట్టింది. ఈ మేరకు స్మార్ట్‌కార్డుల జారీకి సిద్ధమయ్యారు.. నవంబరు మొదటి వారం నుంచి వాహన్, సారథి పోర్టల్‌లో ఈ కార్డుల కోసం ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుంది. దీని కోసం రూ.200 ఫీజుతోపాటు, స్పీడ్‌పోస్టు ఛార్జి రూ.35 ఆన్‌లైన్‌లోనే వసూలు …

Read More »

గుంటూరువాసులకు సూపర్ న్యూస్.. ఏసీలో దర్జాగా, కేంద్రానికి చంద్రబాబు సర్కార్ రిక్వెస్ట్‌తో!

గుంటూరువాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా రవాణా వ్యవస్థలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఈ-బస్‌ సేవ’ పథకంలో భాగంగా.. రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు వంద బస్సులు అవసరమని ప్రతిపాదించారు.. త్వరలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే.. కాలుష్యం కూడా తగ్గుతుంది అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు నిర్వహణ వ్యయం కూడా తక్కువ.. అలాగే ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్‌ …

Read More »

ఆ తండ్రిని చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ఆ రెండు వంటలు బాగా చేస్తా: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

చనిపోతే ఒకే ఒక్క క్షణం.. ఆశయం కోసం పనిచేస్తే అదే శాశ్వతం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చావు గురించి ఆలోచిస్తే ఏదీ చేయలేమని.. ఏదైనా సరే ముందుకెళ్లి ఎదుర్కొందామని అనుకున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న సమయంలో పరిస్థితుల్ని చంద్రబాబు వివరించారు. టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబు గెస్ట్‌గా వెళ్లారు. గతేడాది తన అరెస్టు, జైల్లో గడిపిన రోజులు, కూటమి ఏర్పాటు వంటి అంశాలపై బాలయ్య ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. …

Read More »

AP News: ఒకేరోజు ఆరు ఆలయాల దర్శనం.. స్పెషల్ టూర్ ప్యాకేజ్, ధర ఎంతంటే

ఏపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సరస్వతీ ఘాట్‌లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ముందుగా కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అన్నవరం సత్యనారాయణస్వామి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామిలను దర్శించుకుంటారు. చివర్లో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో గోదావరి …

Read More »