విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో మరణించింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె తల్లి శవం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడం కుటుంబాన్ని, గ్రామస్తులను కలచివేసింది. తల్లీ కూతుళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తల్లి మృతికి తట్టుకోలేక కుమార్తె కూడా తల్లి మృతదేహం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు వదిలింది. విజయనగరం జిల్లా భోగాపురంలో …
Read More »అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
అందమైన సాగరతీర నగరం విశాఖ.. కొందరు అక్రమార్కుల బారినపడి కొన్ని విషయాల్లో మసకబారిపోతోంది. అడపా దడపా డ్రగ్స్ రాకెట్లు, సీజన్‌కోసారి కిడ్నీ అమ్మకం దందాలు.. పోలీసుల్ని సైతం హైరానా పట్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఒడిషా కేంద్రంగా ఒక కిడ్నీ రాకెట్ విశాఖ మీద కన్నేసినట్టు ఖాకీలకు వాసనొచ్చింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే కిడ్నీ బ్రోకర్లుగా మారడం ఇక్కడ బాధాకరమైన కొసమెరుపు. వైజాగ్‌లోని ఒక హోటల్‌ను అడ్డాగా మార్చుకుని కిడ్నీ వ్యాపారానికి పాల్పడే ముఠా ఒకటి విశాఖ పోలీసుల రాడార్‌లోకొచ్చింది. జనవరి 27న తొలిసారి ఫోన్ చేసి.. …
Read More »రైల్వే గేటు సమీపంలో అనుమానాస్పద రీతిలో తచ్చాడిన వ్యక్తి.. కట్ చేస్తే
తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నాడు.. ఈ సమయంలోనే అతను ఏదో టెన్షన్ పడుతూ.. తేడాగా కనిపిస్తున్నాడు.. దీంతో అక్కడున్న వారికి అనుమానం కలిగింది.. అతను ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాలేదు.. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో.. గంజాయ్ గప్పుమంటూ అసలు కథ వెలుగులోకి వచ్చింది.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న …
Read More »ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. రాత …
Read More »ఒకటో తరగతి నుంచి PG వరకు విద్యార్ధులకు హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్.. ఎంపికైతే రూ.75 వేలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.. యేటా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ పేరుతో స్కాలర్‌షిప్‌లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి నిరుపేద విద్యార్ధులకు ఆర్ధిక చేయూత అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 నుంచి …
Read More »మసాజ్ సెంటర్ల ముసుగులో గలీజు దందా.. పోలీసుల మెరుపుదాడుల్లో విస్తుపోయే వాస్తవాలు!
పైకేమో అవి మసాజ్ సెంటర్లు.. లోపల జరిగే యవ్వారమే వేరు. స్పా పేరుతో నిర్వహిస్తూ అమ్మాయిలతో అట్రాక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తే చాలు వలపు వలలో మిమ్మల్ని ఊరిస్తూ ఉంటారు. కాస్త కమిట్ అయితే సర్వసుఖాలు ఉంటాయని ఆఫర్ చేస్తారు. తాజాగా పోలీసుల దాడుల్లో.. ఓ స్పా సెంటర్ చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎంత నిఘా పెడుతున్న.. గుట్టు చప్పుడు కాకుండా ఆ గలీజు దందా సాగిపోతుంది..! స్పా ముసుగులో ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీసం అనుమతులు …
Read More »CM చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం.. 22 ప్రాజెక్టులకు ఓకే.. కీలక నిర్ణయాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టులకు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) 8వ సమావేశంలో 39,473 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆమోదం లభించింది. 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు.భివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు, ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికి అనుగుణంగానే స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ SIPB తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అమరావతిలోని …
Read More »మూడు రోజులపాటు భారీ వర్షాలు.. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్!
రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురవునున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (జులై 18) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం (జులై 19) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురవునున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (జులై 18) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు …
Read More »ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఇంతకీ ఎప్పుడంటే?
ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 541 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) 2025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 14, 2025వ తేదీతో ముగిశాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 541 …
Read More »మరో 3 రోజుల్లో యూజీసీ నెట్ 2025 ఫలితాలు విడుదల.. NTA ప్రకటన
యూజీసీ నెట్ జూన్ సెషన్-2025 పరీక్షల ఫలితాల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాధానాల కీ జూలై 5న విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల జూలై 6 నుంచి జూలై 8 వరకు స్వీకరించింది. తాజా ప్రకటన మేరకు యూజీసీ నెట్ ఫలితాలు జులై 22న విడుదల చేయనుంది. యూజీసీ నెట్ పరీక్షలో అర్హత పొందాలంటే.. జనరల్ …
Read More »