కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల ఒకేసారి మూడు మద్యం దుకాణాల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎమ్మిగనూరు సీఐగా ఎవరు నూతనంగా బాధ్యతలు చేపట్టినా.. మరుసటి రోజే పట్టణంలో దొంగతనం చేసి దొంగలు సదరు సీఐకు స్వాగతం పలికేవారు. అదే విధంగా గత నెలలో నూతనంగా సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీనివాసులుకు రెండో రోజే మూడు మద్యం దుకాణాల్లో దొంగలు చోరీ చేసి, నగదు అపహారించి సవాల్ విసిరారు. ఆయా ఘటనలపై కేసు నమోదు చేశారు …
Read More »ఏపీ మంత్రిపై అభిమానంతో కేజీ చికెన్ రూ.100కే.. ఎగబడిన జనం, ట్రాఫిక్ కష్టాలు
కర్నూలులో బంపరాఫర్ ఇచ్చారు.. రూ.100కే చికెన్ అన్నారు. ఇంకేముంది జనాలు అక్కడికి క్యూ కట్టారు.. దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మద్దూర్ నగర్‌లో షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్‌లు ఉన్నాయి. వీరిద్దరు ఒకరిపై మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100కు తగ్గించారు. దీంతో జనాలు చికెన్ కొనేందుకు షాపుల దగ్గర బారులు తీరారు. ఈ ఆఫర్ ఏమో కానీ వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కలగ జేసుకొని …
Read More »శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. శ్రీశైలంలో పర్వదినాలు, వారాంతపు సెలవు రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులు ప్రయాణించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సును అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ బస్సు గణేశ సదనం, అన్నప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్సు వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని …
Read More »కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట.. ఆ పనులు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ …
Read More »Chandrababu: శ్రీశైలానికి మహర్దశ.. తిరుమల తరహాలో.. మంత్రులతో కమిటీ ఏర్పాటు!
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీశైలం ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి.. ఇందుకోసం పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, జనార్ధన్, కందుల దుర్గేష్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే శ్రీశైలం అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు కూడా …
Read More »విజయవాడ – శ్రీశైలం.. సీ ప్లేన్‌లో చంద్రబాబు జర్నీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణించారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో సీఎం చంద్రబాబు, విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌లో ప్రయాణించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి చంద్రబాబు సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతాళగంగ వద్ద నుంచి చంద్రబాబు రోప్ వేలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ …
Read More »ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …
Read More »బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్లు అప్పు చేసిన కుమారుడు.. తీర్చలేక తల్లిదండ్రుల బలవన్మరణం
ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు. వంశాన్ని నిలబెట్టే వారసుడని.. తమను పున్నామ నరకం నుంచి గట్టెక్కించే పుత్రుడని ఆశలు పెంచుకున్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. అతి గారాబమే తమ పాలిట మృత్యుపాశమవుతుందని.. కన్న కొడుకే తమ చావుకు కారణమవుతాడని.. పాపం ఆ వెర్రి తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మంచి చదువులు చదివించి ప్రయోజకుడిని చేద్దామని భావించిన ఆ కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. చిన్నప్పటి నుంచి గారబంగా పెరిగిన ఆ కొడుకు.. వ్యసనాలకు బానిసయ్యాడు. బెట్టింగులకు బానిసగా మారి కోట్ల రూపాయలు …
Read More »శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం, భక్తుల్లో భయం
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి దగ్గర చిరుత కనిపించింది. అక్కడ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చింది.. ఆ పక్కనే ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు మొత్తం ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అలాగే ఈ తెల్లవారుజామున మరికొన్ని ఇళ్ల దగ్గర చిరుతపులి సంచారం కనిపించింది. జనాల నివాసాల దగ్గర చిరుత సంచారంపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై …
Read More »ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం
CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »