గుంటూరు

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!

గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. సింగయ్య మృతి కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ కూడా పిటిషన్లు …

Read More »

దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..

పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియం ఏరియాకు చెందిన బొనిగె జాన్ సామియేల్ డిగ్రీ చదువుతున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. కర్నాటకలోని ఉడిపిలో బిఎస్సీ చదువుతున్న సమయంలో గంజాయి తీసుకోవడం అలవాటుగా మారింది.. ఈ క్రమంలోనే దేవరాజ్ అనే …

Read More »

వామ్మో.. వాళ్లు అలా వచ్చేది అందుకోసమేనా.. ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా..

ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. డబ్బు నగల కోసం ఓ ముఠా దారుణాలకు పాల్పడింది.. మూడు హత్యలు చేసి.. ఏం తెలియనట్లు నటిస్తున్న ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.. సీసీ ఫుటేజీ సహాయంతో ట్రిపుల్ మర్డర్ కేసులను చేధించారు. వివరాల ప్రకారం.. తెనాలిలోని మారీస్ పేటకు చెందిన కుసుమకుమారి ఇంటికి సమీపంలోనే సుభాషిణి అనే డెభ్బై ఏళ్ల వృద్దురాలు నివసించేది. ఆమె పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈక్రమంలో తమ తల్లి బాగోగులు చూసుకోమని కుసుమ కుమారికి చెప్పారు. అయితే కుసుమ కుమారికి …

Read More »

ఆంధ్రాలో పెరుగుతున్న GBS కేసులు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

గుంటూరు జిల్లా GGHకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఐదుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందంటున్నారుఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతుంది. నాలుగు రోజుల్లో ఏడుగురు బాధితులు గుంటూరు జిజిహెచ్‌కు చికిత్స కోసం వచ్చారు. వీరిలో ఇద్దరు …

Read More »

‘పుష్ప’ సినిమా సీన్.. పుష్పరాజ్‌ను మించి స్కెచ్.. పోలీసులకే మైండ్ బ్లాక్..

‘పుష్ప’ సినిమాలోలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..కానీ అందరూ పుష్పరాజ్‌లా తప్పించుకోలేరుగా..!  అందుకే పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి.. దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. దీంతో తక్కువ టైమ్‌లో డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.పుష్ప’ సినిమా చూశారా? అందులో కథ అంతా ఎర్ర చందనం చుట్టే తిరుగుతుంటుంది. అంతకు ముందు సంగతి ఏమో గానీ, ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే …

Read More »

 రాత్రివేళ మందు పార్టీ అంటూ స్నేహితుడిని పిలిచాడు.. కట్ చేస్తే, చివరకు ఏం జరిగిందంటే..

ఆదివారం రోజు తన స్నేహితులకు మందు పార్టీ ఇస్తున్నానని, ఆపార్టీకి రావాలని దీపక్ ను ఆహ్వనించాడు కిరణ్.. ఆదివారం సాయంత్రం బాలజీ నగర్ సమీపంలోని పొల్లాల్లోకి వెళ్లి అందరూ మద్యం తాగారు.. ఆ తర్వాత కిరణ్ డబ్బులు విషయాన్ని ప్రస్తావించాడు. ఆ విషయమై ఇద్దరి మద్య గొడవ జరగడంతో..ఆదివారం రాత్రి.. పాత గుంటూరులోని బాలాజీ నగర్ కాలనీ.. అటుగా వెల్తున్న ఆటోను కొంతమంది యువకులు ఆపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ ను అడిగారు. యువకుడి పేరు వెంకటరెడ్డి …

Read More »

మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా, శిక్షించాల్సిందే.. ఏపీ హైకోర్టు సీరియస్

గుంటూరు మేయర్, వైఎస్సార్‌సీపీ నేత కావటి మనోహర్‌నాయుడిపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్‌ వంటి పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని.. అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. ఏ పార్టీ వారైనా సరే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. …

Read More »

మంగళగిరిలో అఘోరీ రచ్చ రచ్చ.. పోలీసులపై దాడికి యత్నం.. చివరకు అలా..

రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా హడావిడి చేస్తున్న అఘోరీ సోమవారం మంగళగిరిలో హంగామా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జాతీయ రహదారిపై హల్‌చల్ చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డుపై బైఠాయించిన అఘోరీ.. పవన్ కళ్యాణ్ కలవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళగిరి జనసేన కార్యాలయంలో లేరు. ఇదే విషయాన్ని అఘోరీకి చెప్పిన పోలీసులు అక్కడి …

Read More »

గుంటూరువాసులకు సూపర్ న్యూస్.. ఏసీలో దర్జాగా, కేంద్రానికి చంద్రబాబు సర్కార్ రిక్వెస్ట్‌తో!

గుంటూరువాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా రవాణా వ్యవస్థలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఈ-బస్‌ సేవ’ పథకంలో భాగంగా.. రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు వంద బస్సులు అవసరమని ప్రతిపాదించారు.. త్వరలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే.. కాలుష్యం కూడా తగ్గుతుంది అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు నిర్వహణ వ్యయం కూడా తక్కువ.. అలాగే ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్‌ …

Read More »

గుంటూరు: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు

గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు …

Read More »