తిరుపతి

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శనం, వసతి టికెట్ల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించిన టికెట్ల నవంబర్ కోటాను ఆగస్ట్ 19న టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు నవంబర్ నెలకు సంబంధించి టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఆగస్ట్ 19వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్ట్ 21వ తేదీ ఉదయం పదివరకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్ట్ 21 …

Read More »

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే!

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి విరాళాలు అందుతున్నాయి.. తాజాగా మరొకరు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51,09,116/- విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ మేరకు దాత విరాళం చెక్కును అందించారు. అంతేకాదు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ రూ.4.10 లక్షల విలువైన ఎరువులను టీటీడీ ఉద్యానవన విభాగానికి విరాళంగా అందజేశారు. ఈ ఎరువులను తిరుమల, …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు కళ్యాణోత్సవం రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవాన్ని ఆగస్ట్ 18న తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్ట్ 18న నిర్వహించే కళ్యాణోత్సవాన్ని రద్దుచేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆగస్ట్ 18న కళ్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మరోవైపు ఆగస్ట్ …

Read More »

చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త.. క్యూలైన్‌లలో ఆ సమస్యకు చెక్, నో టెన్షన్

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై రింగురోడ్డులో సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణం వేగవంతం అయ్యింది. తిరుమలలో గత ఐదారునెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయిన భక్తులను రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్‌ భవనం వరకు నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లలో పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఫ్యాన్‌లు, లైట్లు లేకపోవడం, వర్షం పడితే భక్తులు తడిసిపోతుండటం, మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు సరిపోవడం లేదు. అందుకే టీటీడీ శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్ల నిర్మాణం …

Read More »

టీటీడీకి పంజాబ్ కంపెనీ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?

Punjab Company donates 21 crore to TTD Trust: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ)కు భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్. ఈ సంస్థకు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ విరాళం తాలూకు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించారు. …

Read More »

ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ‘హాట్‌స్పాట్లు’గా ఆ 2 సిటీలు.. పెరగనున్న భూముల ధరలు!

Real Estate: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వేగంగా దూసుకెళ్తోంది. దేశాభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2050 నాటికి దేశంలోని 100 నగరాల్లో జనభా 10 లక్షలకుపైగా పెరగనుంది. ప్రస్తుతం 8 మెగా సిటీలకు ఇవి అదనం. పట్టాణాభివృద్ధికి ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, టూరిజం, ఆఫీస్ డైనమిక్స్ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రానున్న 5-6 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు, బలమైన వృద్ధి అవకాశాలను అంచనా వేస్తూ ప్రముఖ రియల్ …

Read More »

తిరుమలకు ఆగస్టు 14, 15 తర్వాత వెళ్తున్నారా.. మూడు రోజుల పాటూ రద్దు, టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. తిరుమల ఆలయంలో ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ రైలు రద్దు చేశారు, మరో రెండు రైళ్లకు అదనపు స్టాప్‌లు

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైమన గమనిక.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 11 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ-కడప మధ్య నడిచే రైలు (17488 ) ఈ నెల 5 నుంచి 10 తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖ రైలు (17487) ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. విజయవాడ సమీపంలో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ప్రయాణికులు …

Read More »