రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రయాణికుల రద్దీ దృష్ట్రా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రూట్‌లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ముఖ్యమైన మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, వారికి ఇబ్బందులను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే …
Read More »సార్.. ముఖం చూసి అమాయకుడు అనుకునేరు..! శ్రీవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన పేరిట చేతివాటం!
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చోట నృత్య ప్రదర్శనంటే మామూలు విషయమా మరి.. అది కూడా తిరుమల ఆస్థాన మండపంలో నృత్యం చేసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఇంకేం భాగ్యం. కళాకారుల కోరికనే తెలంగాణకు చెందిన ఒక మోసగాడికి ఆదాయ వనరైంది. అక్రమంగా వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది. తిరుమలలో నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తానంటూ కళాకారులను అడ్డంగా దోచేసేందుకు మార్గమైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్ ఈ మేరకు ప్లాన్ పక్కాగా అమలు చేశాడు. అయితే అడ్డంగా దొరికి పోయాక …
Read More »తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి …
Read More »వేసవి చివరిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. జూన్‌లో ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా
ఆపదమొక్కుల వాడు కోనేటి రాయుడు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది.తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండటమే నిదర్శనం. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో …
Read More »అవన్నీ అవాస్తవాలు.. భక్తులు నమ్మొద్దంటూ టీటీడీ విజ్ఞప్తి.. ఎందుకంటే
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకుంటారు. అయితే తిరుమల క్షేత్రంలో హోటల్స్ లో లభించే ఆహారపదార్ధాల ధరల గురించి టీటీడీ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.తిరుమల తిరుపతి క్షేత్రం హిందువులకు పరమ అవిత్రమైన స్థలం. కలియుగ వైకుంఠం క్షేత్రం తిరుమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. కోనేటి రాయుడి కోసం తిరుమలకు చేరుకుంటారు. …
Read More »తిరుమలలో చిరుత సంచారం.. అన్నమయ్య భవన్ సమీపంలో మాటువేసి..
చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జనాన్ని భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుండడంతో భక్తుల్లో అలజడి రేపుతోంది. జులై 1 …
Read More »భక్తా.. బరితెగింపా.. శ్రీవారి ఆలయ నమూనాలో మిలటరీ హోటల్.. జనసేన నేతలు ఆగ్రహం..
కలియుగ వైకుంట క్షేత్రం తిరుమల. స్వామివారు కొలువైన ఆలయంలోని గర్భగుడి పైభాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి అడుగు పెట్టగానే పెట్టగానే పులకించి పోతాడు. అటువంటి ఆలయ నమూనా సెట్టింగ్ తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మిలటరీ హోటల్ నిర్మించారు. అయితే శ్రీవారి శ్రీవారి ఆలయ సెట్టింగ్ తో మాంసాహార హోటల్ నిర్వహణపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ కు …
Read More »అయ్యో భాస్కర్.. మళ్లీ పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్.. ఆందోళనలో అధికారులు..
బుసలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు.. విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు.. అతడే పాముల భాస్కర్‌గా గుర్తింపు పొందిన భాస్కర్‌నాయుడు. ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురయి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భాస్కర్‌నాయుడు.. మరోసారి పాముకాటుకు గురయి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు టీటీడీ అధికారులు.ప్రమాదకరమైన, విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్ నాయుడు.. స్నేక్ క్యాచర్‌గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం, నైపుణ్యం ఈయన సొంతం. తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ …
Read More »రూ.కోటికి.. రెండు కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..దిమ్మతిరిగే ట్విస్ట్!
రద్దయిన రూ.2వేల నోట్లతో రెట్టింపు డబ్బును ఆశగా చూపి ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఓ వ్యాపారి నుంచి రూ.కోటి కాజేసి అడ్డంగా దొరికి పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73.20 లక్షల నగదు తోపాటు రెండు వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసిందిచలామణిలో లేని రూ.2వేల నోట్లతో రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశచూపుతూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి …
Read More »శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో ఆటలు.. ఆన్‌లైన్‌లో పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్స్!
తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్‌ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేసి.. శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా …
Read More »