తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలకు కేవలం …
Read More »తిరుపతి లడ్డూ వ్యవహారం.. ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ . ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని.. స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ విషయం తేలిందన్నారు. …
Read More »తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ.. పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డూ. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం అయింది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఇక …
Read More »తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం.. తెరపైకి పవన్ కళ్యాణ్ సంచలన డిమాండ్
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన ట్వీట్‌పై పవన్ స్పందించారు. ఈ లడ్డూ ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని.. వైఎస్సార్సీపీలో హయాంలో ఉన్న టీటీడీ పాలకమండలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం దారుణమని.. ఇది అందరి మనోభావాలనూ దెబ్బతీసిందన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. …
Read More »పవన్ కళ్యాణ్ ఆలోచన బాగుంది.. చిలుకూరు ప్రధానార్చకులు రంగరాజన్
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. తాజాగా ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కూడా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం దారుణమని.. ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యి కోసం టెండరింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర …
Read More »తిరుమలలో భక్తుల ముసుగులో తమిళనాడు మహిళల అతి తెలివి.. ఇలాంటోళ్లతో జాగ్రత్త
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమమైన గమనిక.. మరో కొత్తరకమైన మోసం బయటపడింది. తిరుపతితో పాటూ తిరుమలలో కొందరు మహిళలు రెచ్చిపోతున్నారు. మహానటి చంటి బిడ్డలను చంకన పెట్టుకుని రేంజ్లో నటిస్తారు. అదును చూసి.. ఏమార్చి చోరీ చేసి పారిపోతారు. తిరుమలలోనూ భక్తుల ముసుగులో డబ్బు, నగలు, మొబైల్స్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దర్ని అరెస్ట్ చేశారు తిరుపతి పోలీసులు. తమిళనాడు తూత్తికోరిన్ జిల్లా మంతితోప్పుకు చెందిన భగవత్ శారద, ప్రియలు మంచి స్నేహితులు. ఏడేళ్లుగా వీరు తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, వెంకటగిరి జాతరను టార్గెట్ …
Read More »తిరుపతి లడ్డూ టెస్టు రిపోర్టులో షాకింగ్ అంశాలు.. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా?
తిరుమల లడ్డూ నాణ్యతపై రాజకీయ దుమారం రేగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టులోని మరింత సంచలనంగా మారాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షల కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీకి పంపించారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఈ ల్యాబొరేటరీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తిరుమలలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించి ఈ ల్యాబ్ పంపించిన టెస్టు రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 …
Read More »తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …
Read More »విశాఖవాసులకు టీటీడీ అద్భుత అవకాశం.. ప్రతిరోజూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఎక్కడంటే!
విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఈ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎన్ని రోజులంటే!
Tirumala Darshans Cancelled: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల …
Read More »