ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, …
Read More »భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత
శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు గమనించాల్సిన విషయం ఇది. జలాశయం నిండడంతో భక్తుల రద్దీ పెరగడంతో.. ఈ వారం మధ్యాహ్నం సమయంలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ప్రకటించింది. పరిస్థితిని భక్తులు అర్థం చేసుకోవాలని కోరింది . ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వచ్చేవారికి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ వారం (మంగళవారం నుండి శుక్రవారం వరకు) ఉచిత స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇటీవల శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో జలాశయం నిండుకుండలా …
Read More »నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన… జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉ.10గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి నంద్యాల జిల్లా సున్నిపెంటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 11.00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మ.12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీరు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి మ.2:30 …
Read More »శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!..
శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు, భక్తుల రద్దీ కూడా భారీ పెరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టిన ఆలయ అధికారులు …
Read More »ఎట్టకేలకు భక్తులను కరుణించిన మల్లన్న.. నేటి నుంచి ప్రీ స్పర్శ దర్శనం ప్రారంభం.. టోకెన్ విధానం అమలు
ఎట్టకేలకు భక్తులను కరుణించిన పరమశివుడు. శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం నేటి నుండి ప్రారంభంకానుంది. భక్తుల కోరిక మేరకు ఉచిత స్పర్స దర్శనాలను దేవస్థానం అధికారులు మళ్ళీ ప్రారంభించారు. రోజుకు 1200 మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది, నూతన టోకెన్ సిస్టం ద్వారా ఉచిత స్పర్శ దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం అవుతుందని శ్రీశైల …
Read More »శివయ్యా ఇన్నాళ్లకు కరుణించావా..! శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం – ఎప్పటి నుంచి అంటే
శైవ భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం దేవస్థానం. రోజుకు 1000 మంది చొప్పున శ్రీశైలంలో వెలసిన జ్యోతిర్లింగ స్పర్శ దర్శనానికి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సదావకాశం గతంలో ఉన్నదే అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యలో బంద్ చేశారు. తర్వాత మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభిస్తున్నారు. ప్రతివారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లోనే ఈ స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే ఈ స్పర్శ దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల …
Read More »రోడ్డుపై వెళ్తుండగా కనిపించిన తెల్లటి కవర్.. ఏముందా అని చూడగా.. అమ్మబాబోయ్
శ్రీశైల మహాక్షేత్రంలో అనుమానాస్పదంగా బులెట్స్ వెలుగు చూడడం కలకలం రేపింది. స్ధానిక వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ మధ్యలో బులెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసేవారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్. బాంబ్ స్క్వాడ్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్‌కు చెందిన ఐదు బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్‌కు చెందిన నాలుగు …
Read More »బ్యాంక్ నిండా లక్కీ భాస్కర్లే..! కోఆపరేటివ్ బ్యాంకులో లక్షలకు లక్షలు మింగేశారు.. చివరకు..!
ఆత్మకూరు కేంద్ర సహకార బ్యాంకులో కోట్ల రూపాయలు మాయమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉద్యోగులు, అధికారులు బ్యాంకు నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, నాగంపల్లి సొసైటీ సీఈవో కోటేశ్వరరావు రూ.40 లక్షలు దారి మళ్లించినందుకు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.చాలా మంది లక్కీ భాస్కర్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో ఓ బ్యాంక్‌లో పనిచేస్తూ.. తన అవసరాల కోసం బ్యాంక్‌లో డబ్బును అడ్డదారిలో తీసుకెళ్లి, తన అవసరాలును తీర్చుకొని.. మళ్లీ తీసుకొచ్చి బ్యాంక్‌లో …
Read More »మహానంది క్షేత్రంలో విషసర్పాలు హల్‌చల్..! భయపెడుతున్న అడవి జంతువులు
స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును ఓక సంచిలో బంధించి సమీపంలో ఉన్న అడవిలో వదిలి పెట్టారు.దీంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. మహానంది ఆలయం చుట్టూ చిరుతలు పెద్దపులులు ఎలుగుబంట్లు తరచుగా తిరుగుతుండేవి. సీసీ కెమెరాలు ఈ విషయాల్లో స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నాగుపాములు సైతం ఆలయం దగ్గరకు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్ చల్ చేసింది.ఆలయ సమీపంలో నాగుపామును గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.విషయం తెలుసుకున్న …
Read More »శివరాత్రి బ్రహ్మోత్సవాల వేల శ్రీశైలం వచ్చే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్
శివరాత్రి సమయంలో మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మంత్రులు శ్రీశైలం వచ్చి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. మహాశివరాత్రి అంటే శివ భక్తులంతా భక్తి పారావస్యంతో మునిగితేలుతారు. అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే ఇక భక్తులకు పండగే. ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంకి భక్తులు తరలివస్తారు. ఎందుకంటే శక్తి పీఠాలలో జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది. అంతేకాదు ఒకే చోట శక్తి పీఠము …
Read More »