ఆంధ్రప్రదేశ్

Cyclone Fengal: తుఫాన్ ఉగ్రరూపం.. అమ్మబాబోయ్.! ఏపీలో ఈ ప్రాంతాల్లో వానలు దంచుడే

ఫెంగల్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది. గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతుంది తుఫాన్. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కి.మీ, చెన్నైకి 140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ …

Read More »

Mahakumbh Mela 2025: కుంభమేళా వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్‌ నడపనున్న రైల్వే

ప్రముఖ ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళాను ప్రయాగ్ రాజ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు శర వేగంగా చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్లో జరగనున్న మహాకుంభమేళా కోసం 1300 రైళ్లను నడపనున్నది రైల్వే సంస్థ, ఇప్పటికే నడిచే 140 సాధారణ రైళ్లు కాకుండా.. ఈ మేళాలో స్నానమాచరించే భక్తుల కోసం 1,225 ప్రత్యేక రైళ్లను నడపనుంది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా …

Read More »

మళ్లీ ఆర్థిక వివాదాల్లో వైసీపీ అధినేత.. అసత్యాలు ప్రచారం చేస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ మళ్ళీ వివాదాలు అలుముకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉండగా సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు చేసుకున్న ఒప్పందాలపై వస్తున్న విమర్శలు వైఎస్ జగన్ చుట్టూ ముసురుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులో నమోదైన కేసులు రాజకీయంగా తీవ్ర వివాదాలకు కారణం కాగా, అధికారాన్ని చేపట్టిన తర్వాత అదానీతో చేసుకున్న ఒప్పందాలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్లకు ఆశపడి చేసుకున్నారంటూ వైసీపీ అధినేత పై విమర్శల అధికార పార్టీ దాడి చేస్తుంది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

 ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!

ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్.విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చూస్తే పరిసర ప్రాంతాల్లో ఏదో ద్రావణం పడినట్టు …

Read More »

 గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి సర్కార్‌ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. గండికోట, రాజమండ్రి పుష్కర్ ఘాట్‌ డెవలెప్‌మెంట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయడమే అందుకు నిదర్శమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.ఆంధ్రప్రదేశ్ లోని రాజుల పరిపాలనకు సజీవ సాక్ష్యం అయిన గండికోట అభివృద్ధికి కేంద్ర టూరిజం శాఖ 77.91 కోట్లు మంజూరు చేసింది. ఏపీలోని గండికోట, పుష్కర్ ఘాట్‌కు కేంద్ర టూరిజం శాఖ నిధులు విడుదల చేయడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై …

Read More »

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …

Read More »

పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?

తపాలా శాఖ పోస్టాఫీస్ లు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం మహిళలతో పోటెత్తుతున్నాయి. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్టాఫీస్ మరో జాతరను తలపిస్తోంది. పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచన ఇప్పుడు మహిళల లబ్ధిదారుల్లో ఆందోళన కు కారణమైంది. రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే …

Read More »

ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది.. నయనతార చెప్పిన కర్మ సిద్ధాంతం.. ధనుష్ గురించేనా.. ?

హీరోయిన్ నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే సుమారు మూడు పేజీలతో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది నయన్. హీరో ధనుష్ ను ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టాలో షాకింగ్ పోస్ట్ చేసింది.లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైలెంట్‏గా ఉన్న వార్.. ఇప్పుడు రచ్చకెక్కింది. నానుమ్ రౌడీ సినిమా నుంచి మూడు సెకన్ల వీడియో ఉపయోగించినందుకు …

Read More »

ఇక ప్రజల్లోకి జగన్.. జిల్లాల వారీగా పర్యటనలు ఎప్పటి నుంచంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఓ వైపు సోషల్ మీడియా అరెస్టులు, మరో వైపు అదానీ వ్యవహారం.. ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సంక్రాంతి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు.. తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. …

Read More »

డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. యాంకరేజ్‌ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్‌ రెండు రోజుల క్రితం సముద్రంలో …

Read More »