ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని APCRDAలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)… ఒప్పంద ప్రాతిపదికన కింది రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.. నవంబర్‌ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్‌ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు …

Read More »

చంద్రబాబూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపరేంటి: వైఎస్ జగన్ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి అన్యాయం చేసేలా ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ‘చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నేటి నుంచే మొదలు, మంచి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్న ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రకాల సరుకుల్ని పంపిణీ చేయనున్నారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇవాళ్టి నుంచి కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేయనున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత పూర్తిస్థాయిలో సరుకుల్ని ప్రజలకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో …

Read More »

ఏపీలో అన్న క్యాంటీన్లకు యువ పారిశ్రామికవేత్త భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఆంధ్రప్రదేశ్‌లో అన్నక్యాంటీన్ల నిర్వహణకు, వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు సాయం అందిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాలు అందజేశారు. ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత సజ్జా రోహిత్ అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి..‌ అన్నక్యాంటీన్ల కోసం రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. అన్నా క్యాంటీన్ల కోసం భారీ విరాళం అందజేసిన సజ్జా రోహిత్‌‌ను చంద్రబాబు అభినందించారు. మరోవైపు రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్ధం ఎస్‌కే యూనివర్సిటీ సిబ్బంది తరఫున జీ వెంకటనాయుడు …

Read More »

ఏపీ ఉచిత గ్యాస్ సిలండర్ల పథకం.. తొలిరోజు ఎంతమంది బుక్ చేసుకున్నారంటే, అంత తక్కువా!

ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మొదలైంది. ఈ నెల 29 నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ దీపం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించనున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సూపర్‌ సిక్స్‌లో అమలవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకమని గుర్తు చేశారు. తొలిరోజు 4.3 లక్షల బుకింగ్‌లు అయ్యాయని.. లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు. గ్యాస్ రోజుకు రెండున్నర …

Read More »

ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు, పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవుబారిన పడినట్లు తెలిపారు. అలాగే మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లుగా నివేదికలు వచ్చాయని ప్రస్తావించారు. ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో కరవు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెల 1 నుంచి పక్కా, నాలుగు రకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరుకుల్ని అందజేయనుంది. వచ్చే నెల నుంచి నాలుగు రకాల సరకులు తెల్లరేషన్‌ కార్డుదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరుకులు చేరగా.. బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఈ సరుకుల్ని కచ్చితమైన తూకాలు, నాణ్యమైనవి సరఫరా చేయనున్నారు. అక్టోబరు నెలలో 50 శాతానికిపైగా కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయగా.. నవంబరులో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించబోతున్నారు. నవంబరులో …

Read More »

ఏపీలో మందుబాబులకు అదిరే శుభవార్త.. ధరలు తగ్గింపు, కొత్త బ్రాండ్లు వస్తున్నాయి!

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు తీపికబురు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.. రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. అద్భుత అవకాశం, త్వరపడండి

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను న‌వంబ‌రు 7వ తేదీన టెండర్‌, వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్‌ బియ్యం 13,880 కేజీలు టెండర్‌, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ …

Read More »