ఆంధ్రప్రదేశ్

యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …

Read More »

ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు

Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే.. అప్పుడు పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. కొండపై రద్దీ పెరగడంతో దర్శనం విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. …

Read More »

రాజమండ్రిలో చిక్కని చిరుత.. భయం గుప్పిట్లో శివారు ప్రాంతాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత కనిపించి 9 రోజులు దాటింది. అయితే ఇప్పటికీ దానిని అటవీశాఖ బంధించలేకపోతోంది. దీంతో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. అయితే శుక్రవారం చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. శివారు ప్రాంతాలైన దివాన్ చెరువు, లాలా చెరువు, స్వరూప్ నగర్, తారక నగర్, శ్రీరాంపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా …

Read More »

3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభం.. రామ్మోహన్ నాయుడా మజాకా!

ఏపీ వాసులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో్హన్ నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే గన్నవరం నుంచి దుబాయి, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెడతామన్న మంత్రి.. విజయవాడ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుతామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు …

Read More »

వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ.. ఏపీ హైకోర్టు సీరియస్, ఆ పదజాలంపై అభ్యంతరం

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తనకు భద్రత పెంచాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్‌లో జగన్‌కు మద్దుతగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాజావలి ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడంపై సీరియస్‌గా స్పందించింది. జగన్‌ ఓవైపు తన భద్రత గురించి పిటిషన్‌ వేశాక.. మూడో పక్షం ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొందరు కోర్టుల్నిప్రచార వేదికలు, క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారని ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఖాజావలి ఇంప్లీడ్‌ పిటిషన్లో …

Read More »

అనంతపురం: రూ.లక్షకు. రూ.4 లక్షలు.. అదిరిపోయే ఆఫర్.. చివర్లో అసలు ట్విస్ట్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త దందా మొదలైంది.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. రూ.లక్షలకు రూ.4 లక్షలంటూ ఎర వేస్తున్నారు.. అమాయకంగా వాళ్ల మాటలు నమ్మితే అంతే సంగతులు. ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు కలకలంరేపింది. ఈ కేటుగాళ్ల మాయంలో పడి చిరువ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ధర్మవరంలో చేనేత వస్త్రాలు తయావుతాయి.. అందుకే బెంగళూరుతో పాటూ ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు వస్తుంటారు. ఇక్కడ వ్యాపారం …

Read More »

అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్‌లలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ చెల్లించబోతోంది. అమరావతి రైతులకు కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్ని సీఆర్డీఏకు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేశారు. అంతేకాదు అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది. మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ …

Read More »

ఏపీలోని ఆ స్టేషన్‌లో కూడా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాప్!

ఏపీలోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఆగనుంది. ఈ మేరకు వందేభారత్‌ హాల్ట్‌కు రైల్వే సహాయ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి దుర్గ్-విశాఖపట్నం మధ్య వందేభారత్‌ రైలు పట్టాలెక్కబోతోంది. అయితే పార్వతీపురంలో స్టాప్‌ లేకుండానే రైల్వే అధికారులు ఈ వందేభారత్ రైలు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. అయితే ఈ రైలుకు పార్వతీపురం, టౌన్‌ రైల్వే స్టేషన్‌ల్లో నిలుపలేదు. వెంటనే స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర విశాఖపట్నంలోని డీఆర్‌ఎంతో పాటుగా అధికారులను …

Read More »

వైఎస్ జగన్‌తో సెల్ఫీ.. మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు చిక్కులు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్‌ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్‌ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన …

Read More »