ఆంధ్రప్రదేశ్

నకిలీ టికెట్లతో తిరుమల దర్శనం.. 4 టికెట్లకు రూ.11 వేలు.. సిబ్బంది చేతివాటం

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది తిరుపతికి వస్తారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోగా.. చాలా మంది సర్వదర్శనానికే వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే సర్వదర్శనానికి 24 గంటల సమయం కూడా పడుతుంది. అయితే టికెట్ బుక్ చేసుకోకుండా వచ్చిన భక్తులు.. తిరుమలలో రద్దీ చూసి భయపడి దళారులను ఆశ్రయించి.. అధిక ధరలకు టికెట్లు కొంటూ ఉంటారు. కొన్నిసార్లు నకిలీ టికెట్లు కొని మోసపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా భక్తుల వీక్‌నెస్‌ను …

Read More »

ఏపీవాసులకు గుడ్‌న్యూస్.. నెరవేరనున్న ఏళ్ల నాటి కల.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Railway Zone: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ.. ఏపీలో తిరుగులేని సీట్లతో అధికారంలోకి రావడంతో.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. ఒకప్పుడు అవన్నీ కలలుగానే ఉండగా.. రెండోసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడిప్పుడే అవన్నీ ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వేజోన్‌ ఏర్పాటు కానుందని రైల్వేశాఖ మంత్రి …

Read More »

నలుగురి ప్రాణం తీసిన కలుషితాహారం.. రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితహారం తిని నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి …

Read More »

ఏపీలోకి ఫాక్స్‌కాన్!.. నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల చర్చలు

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా …

Read More »

గంజాయికి అవకాడోతో చెక్.. ఎకరాలో పండిస్తే ఇంత లాభమా? ఐడియా అదిరింది గురూ

మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు …

Read More »

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని …

Read More »

పవన్‌ చెప్పినా బేఫికర్‌!

కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు! కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన బయో వేస్ట్‌ ప్లాంట్ల ఏర్పాటులో సీపీసీబీ మార్గదర్శకాలకు తూట్లు విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతివ్వాలని నిర్ణయం అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో అయినా ఫైలు నడుపుతున్న అధికారులు భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం అప్పిలేట్‌ అథారిటీ ఆదేశాలు బేఖాతర్‌ సీపీసీబీ వ …

Read More »

సోదర బంధానికి రక్ష! రక్ష!

శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. నేడు రాఖీ పౌర్ణమి శ్రావణం ఐశ్వర్యప్రదమైన మాసం. దీని విశిష్టతను పరమశివుడు పార్వతికి వివరిస్తూ ‘‘అస్మిన్‌ మాసే కృతం యద్యత్తదనంతాయ కల్పతే… ఈ మాసంలో ఆచరించే క్రతువులు అనంతమైన ఫలాలను ఇస్తాయి’’ అని చెప్పాడు. ఎంతో మహిమాన్వితమైన ఈ నెలలో… పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. హయగ్రీవుడిగా శ్రీమహావిష్ణువు అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే. …

Read More »

Donations: అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువ.. రూ.కోటి అందజేసిన మాజీ ఎంపీ

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో 2019కి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పేదలకు రూ.5లకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. మర్నాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలన్న చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన వస్తోంది. పలువురు ముందుకొచ్చి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, అన్న క్యాంటీన్ల నిర్వహణకు …

Read More »

Chandrababu Delhi Tour: ప్రధానమంత్రి మోదీతో చంద్రబాబు భేటీ.. చర్చించిన విషయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతోపాటుగా ప్రధాని మోదీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన …

Read More »