ఆంధ్రప్రదేశ్

కాలు దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్లాడు.. పాపం ప్రాణాలే పోయాయి, డేంజర్ బ్యాక్టీరియా

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో పలు ప్రాంతాలు మునిగిపోయాయి. విజయవాడతో పాటుగా గుంటూరులోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. అయితే జగ్గయ్యపేటలో ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఓ బాలుడు కాలును కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 81 ఏళ్ల వృద్ధుడు ఏకంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు నెహ్రూనగర్ ఆరో వీధిలో నివాసం ఉంటున్న నారాయణకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.. ముగ్గురికి వివాహాలు అయ్యాయి. నారాయణ …

Read More »

ఈ టీచర్ మహా ముదురు.. ఏకంగా రూ.6.70కోట్లు, మనోడి గురించి తెలిస్తే!

ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది.. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ తోటి ఉద్యోగుల్ని, జనాల్ని నిండా ముంచేశారు. ఉన్నట్టుండి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.. తీరా ఆరా తీస్తే ఆయన చేతిలో మోసపోయినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేస్తవారపేటకు చెందిన కిషోర్‌కుమార్‌.. కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్ (ప్రభుత్వ ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్నారు. ఆయన తోటి ఉపాధ్యాయులు, స్థానికులు, వ్యాపారుల్ని.. చీటిపాటలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశారు. కిషోర్ కుమార్ మెడికల్‌ …

Read More »

ఈ ఫ్రూట్ ధర కేజీ రూ.500.. భారీ లాభాలు, యువ రైతు సక్సెస్ స్టోరీ

ఏలూరు జిల్లా పోలవరానికి చెందిన యువ రైతు పోషకాల పండు సాగుతో భారీ లాభాలు అందుకుంటున్నారు. ముందు ఒక మొక్కను తెచ్చి నాటి చూశారు.. ఆ తర్వాత ఆ పండు విలువ తెలిసి సాగు ప్రారంభించారు. మంచి సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ పండు చూడటానికి నారింజ రంగు.. ఆగాకర వంటి ఆకారంలో కనిపిస్తుంది. ఈ కాయను కోసి చూస్తే.. పసుపు రంగు గుజ్జు మధ్య ఎర్రటి రసంలో గింజలు ఉంటాయి. ఆ పండు పేరు గ్యాక్ (గ్రేట్‌ అమెరికన్‌ కంట్రీ) …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్‌ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఈ అంశంపై …

Read More »

2024: దసరాకు దుర్గ గుడికి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

విజయదశమి వచ్చిందంటే చాలు.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం కిటకిటలాడిపోతుంది. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గ గుడికి భక్తులు పోటెత్తుతారు. అమ్మవారి రూపాలను చూసి తరిస్తుంటారు. ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కోసం అధికారులు కూడా విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనం రామనారాయణ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై …

Read More »

డిగ్రీ, పీజీ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పనిసరి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల బోధనా రుసుముల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బోధన రుసుముల చెల్లింపు కోసం విద్యార్థి హాజరు శాతం కచ్చితంగా 75 శాతం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులు కాలేజీలకు రాకపోయినా కూడా 75 శాతం అటెండెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోధన రుసుముల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై …

Read More »

తిరుమలకు మెట్ల మార్గంపై తప్పుడు ప్రచారం.. భక్తులకు టీటీడీ అలర్ట్

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని టీటీడీ సూచించింది. తిరుపతి అలిపిరి పాదాల మండపం దగ్గర గోశాల ప్రక్కన భక్తుల సౌలభ్యం కొరకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసేందుకు తాత్కాలిక షెడ్లు, క్యూ లైన్లు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న పాదాల మండపంం మెట్ల దారి యథావిధిగా ఉంటుంది అన్నారు. అయితే ఒక వ్యక్తి అక్కడ నుంచి మెట్ల మార్గానికి ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇకపై అలిపిరి పాదాల …

Read More »

ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు, జనసైనికులకు మరో పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన …

Read More »

సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి, నర్సాపురం బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, ప్లాంట్ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్యాకేజీలు ఇవ్వలేదని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తేల్చి చెప్పారు. సెయిల్‌లో వీలీనానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయన్న ఆయన.. అయినా …

Read More »

యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా.. కాకినాడ కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు

దిగ్గజ సంస్థ, ఐఫోన్ ఉత్పత్తి కంపెనీ యాపిల్‌కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఐఫోన్‌ కొనుగోలు చేస్తే ఇయర్‌ పాడ్స్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటన చూసి తాను మోసపోయాయని ఓ యువకుడు యాపిల్‌‌పై మూడేళ్ల కిందట ఫిర్యాదు చేశాడు. ఫోన్ కొంటే తనకు ఇయర్‌ పాడ్స్‌ ఇవ్వలేని అతడు ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్.. యాపిల్‌ సంస్థకు రూ.లక్ష జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెల్లడించింది. అయితే, ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు …

Read More »