ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు, జనసైనికులకు మరో పిలుపునిచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలతో కల్తీ జరిగి మహా అపచారానికి గురైంది అన్నారు పవన్ కళ్యాణ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ దీనిని నిరసిస్తూ.. ఈ డిజైన్‌లో మీ ఫోటో పెట్టుకుని.. ‘ఓం నమో నారాయణాయ’ మహా మంత్రాన్ని జపించాలని పిలుపునిచ్చారు. తిరుమలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని క్షమాపణ వేడుకోవాలి అని కోరారు. తిరుమల ఆలయ సంప్రదాయాలు, సనాతన ధర్మం పవిత్రతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ వివాదం తర్వాత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22న గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 11 రోజులపాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని దీక్షు విరమించనున్నారు.

మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళవారం (అక్టోబర్ 1) రోజు తిరుమల పర్యటనకు వెళుతున్నారు. పవన్ అక్టోబరు 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. ఆయన మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట వెళతారు. అక్కడ నుంచి నేరుగా అలిపిరి దగ్గర ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండకు నడిచి వెళతారు.. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు.

About amaravatinews

Check Also

 సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. చర్చంతా వాటిపైనే..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *