ఆంధ్రప్రదేశ్

విజయవాడ: నీళ్లలో తిరిగి కాలు పోగొట్టుకున్న బాలుడు.. ఆ బ్యాక్టీరియా చాలా డేంజర్

ఇటీవల వరదలు విజయవాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అయితే వరద నీటిలో తిరిగిన ఓ బాలుడు కాలును పోగొట్టుకున్నాడు. నీళ్లలో తిరిగితే కాలు పోయిందా అంటే.. దీనికి వెనుక కారణం ఉంది. ఒక బ్యాక్టీరియా కారణంగా బాలుడు కాలును కోల్పోవాల్సి వచ్చింది.. రెండో కాలుకు కూడా ఆ బ్యాక్టీరియా సోకింది. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న కొత్తా నాగరాజు ప్రైవేట్ కంపెనీలో.. కోడలు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుమారుడు భవదీప్ ఏడో తరగతి చదువుతున్నాడు. భవదీప్ …

Read More »

ఏపీలో మద్యం దుకాణాలు రద్దు.. చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాప్‌లను రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం …

Read More »

టీటీడీ ఈవోతో కేఎంఎఫ్ (నందిని డెయిరీ) ప్రతినిధుల భేటీ.. ఎందుకంటే!

టీటీడీ ఈవో జే శ్యామలరావును కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డైరీ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డైరీ ఉత్పత్తులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా ఈవోకు వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవో గౌతమి, కేఎంఎఫ్ ఎండి ఎంకె జగదీష్, డైరెక్టర్లు రఘునందన్, రాజశేఖర్ మూర్తి, మంజునాథ్ పాల్గొన్నారు. ప్రధానంగా నెయ్యి నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు, దేశంలో ఎక్కడెక్కడకు పాలు, నెయ్యి సరఫరా చేస్తున్నారనే అంశాలను వివరించారు. అలాగే …

Read More »

వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీలో కీలక మార్పులు, వాళ్లందరికి పదవులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో మార్పులు, చేర్పులు మొదలుపెట్టారు. అన్ని జిల్లాలకు కొత్తగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు.. తాజాగా మరో మూడు జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులను మార్చారు. విశాఖపట్నం జిల్లాకు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును అధ్యక్షులుగా నియమించారు. 2024 ఎన్నికల ముందు పంచకర్ల రమేష్‌బాబు‌ పార్టీని వీడటంతో.. విశాఖపట్నం జిల్లాకు …

Read More »

కేంద్రంలో టీడీపీ ఎంపీకి కీలక పదవి.. మరో బీజేపీ ఎంపీకి అవకాశం

ఏపీలో కూటమికి చెందిన ఇద్దరు ఎంపీలకు రెండు కీలకమైన పదవులు దక్కాయి. ఇద్దరికి పార్లమెంటు స్థాయీసంఘాల ఛైర్మన్‌ పదవులు దక్కాయి. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయీసంఘం ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నియమించారు. రైల్వేశాఖ స్థాయీసంఘం ఛైర్మన్‌గా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ను విడుదల చేసింది. అలాగే పర్యాటక, రవాణా, సాంస్కృతిక స్థాయీసంఘం ఛైర్మన్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి ఆ పదవి కోల్పోయారు. టీడీపీ ఎంపీ కేశినేని …

Read More »

తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటి.. టీటీడీ నిబంధన ఇదే, జగన్‌‌ నుంచి డిక్లరేషన్‌ కోరనున్న అధికారులు?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్‌ కోరినట్లే మాజీ సీఎం జగన్‌ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి.. ముందుగానే ఆయనకు డిక్లరేషన్‌ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు.. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని …

Read More »

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్‌ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్‌ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్‌ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …

Read More »

వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు,

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై …

Read More »

ఏపీలో 16మంది ఐపీఎస్‌లు బదిలీ.. వెయిటింగ్‌లో ఉన్నవాళ్లకు పోస్టింగ్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. వినీత్‌ బ్రిజ్‌లాల్‌, పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం.రవిప్రకాష్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ స్థాయి అధికారులకూ పోస్టింగ్‌లు వచ్చాయి. ఎస్‌ఐబీ ఐజీగా ఉన్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను సీఐడీకి బదిలీ చేశారు. బ్రిజ్‌లాల్ స్థానంలోకి పీఅండ్‌ఎల్‌ (ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స) ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణను బదిలీ చేశారు. సెబ్‌ రద్దు కావడంతో సెబ్‌ ఐజీగా ఉన్న ఎం రవిప్రకాష్‌ను పీఅండ్‌ఎల్‌ ఐజీగా పోస్టింగ్‌ దక్కింది. విశాఖపట్నం …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. ఉచితంగా దర్శనం, వసతి.. ఒక్కరోజే, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులు, అంగప్రదక్షిణలు, శ్రీవారి సేవలకు సంబంధించి ప్రతి నెలా ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల్ని విడుదల చేయగా.. భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ఈ నెల 27న డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ కోటా విడుదల చేయనుంది టీటీడీ. శుక్రవారం (సెప్టెంబరు 27)రోజున తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది టీటీడీ. అలాగే న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం …

Read More »