తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శనివారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి వాడారన్న వార్తల నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఏం చేయాలనే దానిపై చర్చించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో తిరుమలలో …
Read More »తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …
Read More »కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మరో రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ముడిపదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మరో రెండున్నర వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే రూ.500 కోట్లు మంజూరు చేయగా.. వాటితో పాటుగా మరో రెండున్నర వేలకోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన …
Read More »LIC సంచలన నిర్ణయం.. ఇక రోజుకు రూ.100 చాలు.. అక్టోబర్ 7లోపే అమలులోకి!
LIC: ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చిన్న మదుపరులను ఆకర్షించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పెట్టుబడిదారులకు తమ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. త్వరలోనే రోజుకు రూ.100తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ రవి కుమార్ …
Read More »తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక రైలు పొడిగింపు, ఈ రూట్‌లోనే
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ప్రత్యేక రైలును డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోలాపూర్-తిరుపతి-సోలాపూర్(01437/01438) మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు రాయలసీమ మీదుగా నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు గడువును డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ సోలాపూర్-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా.. ట్రైన్ ఆన్ డిమాండ్ ఉండడంతో డిసెంబరు 26వ తేదీ వరకు.. తిరుపతి- సోలాపూర్ నడుమ (04138) …
Read More »మీరు మీ హద్దుల్లో ఉండండి.. ప్రకాష్ రాజ్‌కు విష్ణు మంచు వార్నింగ్
తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ, తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసేలా, భక్తుల మనోభవాలు దెబ్బ తీసేలా వ్యవహరించిందని, లడ్డూ తయారికి నాసిరకం నెయ్యిని.. జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్‌తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని.. జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ …
Read More »జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్, టీడీపీలోకి చేరాలనుకున్నా!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి విస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మొన్నటి వరకు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోయిన ఆయన చివరికి జనసేనవైపు మొగ్గు చూపారట. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆదివారం జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో …
Read More »తిరుపతి లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా.. దేశంలో వేరే సమస్యలు లేవా, సీమాన్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ ఇటీవల వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోకి తిరుమల లడ్డూ వివాదం తెగ చర్చనీయాంశంగా మారింది. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు తిరుపతి లడ్డూపైనే చర్చ జరుగుతోంది. దేశంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, తిరుమల పవిత్రతకు భంగం కల్గించారని తీవ్ర …
Read More »నెల్లూరులో పరువు హత్య కలకలం.. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌కాల్‌తో, మిస్సింగ్ కేసు హత్యకేసుగా!
నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారు. ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టి కూతురు కనిపంచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ మిస్టరీ వీడింది. చివరికి మిస్సింగ్ కాస్తా హత్యకేసుగా మారింది. కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన ఘటన కలకలంరేపింది. కొడవలూరు మండలం పద్మనాభునిసత్రం పల్లిపాలెంకు చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. రెండో …
Read More »జగన్‌కు తలనొప్పిలా మారిన మంత్రి నారాయణ పెట్టిన కేసు.. మరోసారి హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా.. రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని అప్పటి మంత్రి నారాయణ.. 2018లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal