మీరు మీ హద్దుల్లో ఉండండి.. ప్రకాష్ రాజ్‌కు విష్ణు మంచు వార్నింగ్

తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ, తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసేలా, భక్తుల మనోభవాలు దెబ్బ తీసేలా వ్యవహరించిందని, లడ్డూ తయారికి నాసిరకం నెయ్యిని.. జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్‌తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని.. జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.

దీనిపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు.. లడ్డూ వివాదం జరిగింది మీ రాష్ట్రంలో.. మీరు అక్కడ డిప్యూటీ సీఎం.. విచారణ చేసి దోషుల్ని తేల్చండి.. దాని కోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు? జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. దీనిపై విష్ణు మంచు తాజాగా అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు.

ప్రకాష్ రాజ్ గారు మీరు కాస్త తగ్గించుకోండి.. తిరుమల ప్రసాదం, లడ్డూ అంటే కేవలం లడ్డూ అనే కాదు.. మాలాంటి కోట్ల మంది భక్తుల, హిందువుల విశ్వాసానికి ప్రతీక. దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేయిస్తారు.. ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారు.. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది.. మీలాంటి వారు ఇలాంటి వాటిపై స్పందిస్తే.. మతానికి ఏ రంగు అంటుకుంటుందో అని అన్నాడు.

About amaravatinews

Check Also

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *