ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్ ‘రెడ్ బుక్‌’కు N-కన్వెన్షన్‌ కూల్చివేతకు లింక్.. గాదె ఇన్నయ్య సంచలన కామెంట్స్

ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ …

Read More »

రాజీనామాకు రెడీ.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామంటూ చెబుతున్న అటవీశాఖ సిబ్బందికి సవాల్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో నిర్వహించిన వనమహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గత 5 నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తాను అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే అయ్యన్నపాత్రుడు అటవీ …

Read More »

ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. రెండు రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది.. ఆదివారం తెల్లవారుజాముకు వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. …

Read More »

ఏపీలో దిశ పోలీస్ స్టేషన్‌ల పేర్లు మార్చిన ప్రభుత్వం.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. 2014-2019 టీడీపీ హయాంలో మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉండేవి.. జగన్ సర్కార్ వాటిని దిశ పోలీస్ స్టేషన్‌లుగా పేరు మార్చింది. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దిశ చట్టానికి కేంద్రం …

Read More »

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావంతో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.. ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం రెండురోజుల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు …

Read More »

ఏపీ కేబినెట్‌ భేటీలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రస్తావన.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్ డే అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబరు ఒకటో తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లవుతోందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబరు …

Read More »

ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. మంత్రులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇన్నాళ్లు పార్టీ నిర్మించుకున్న మంచిపేరును కొందరు ఎమ్మెల్యేలు దెబ్బతీస్తున్నారని మంత్రులతో అన్నారు. ఆ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు పేపర్లలో వస్తున్నాయని ప్రస్తావించిన చంద్రబాబు.. వారికి వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ఎమ్మెల్యేల పట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు విచారం వ్యక్తం చేవారు. ఇదే సమయంలో మంత్రులు కూడా …

Read More »

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. చెన్నై భక్తుడు పెద్ద మనసుతో, కొండపై పరిశుభ్రత కోసం

తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన సంస్థ లారీని విరాళంగా అందజేసింది. చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కార్తీక్ ‌ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ప్రతి శనివారం ఆన్‌లైన్‌లో టోకెన్లు, బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లు.. ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఇలా లక్కీడిప్ లో టోకెన్లు పొందిన భక్తులకు …

Read More »

శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో బయటపడిన కొత్త రకం మోసం

Tirumala: శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది.. తిరుమలకు చేరుకుంటారు. అయితే రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు అక్కడి నిబంధనలు, సౌకర్యాలు తెలియవు. అయితే ఇలాంటి భక్తులను టార్గెట్ చేసుకుని మోసాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెరైటీ మోసం వెలుగులోకి వచ్చింది. లాకర్ల పేరుతో భక్తులను బెదిరింటి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దితుడిని …

Read More »