రాజీనామాకు రెడీ.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామంటూ చెబుతున్న అటవీశాఖ సిబ్బందికి సవాల్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో నిర్వహించిన వనమహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గత 5 నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తాను అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

అలాగే అయ్యన్నపాత్రుడు అటవీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం డివిజన్లో ఉన్న సామిల్లో కలప స్మగ్లింగ్ జరుగుతోందని.. దీనికి కొంత మంది అటవీ శాఖ అధికారులు సహకరిస్తున్నారని బాంబ్ పేల్చారు. ఈ క్రమంలో కలప స్మగ్లింగ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను.. అలాగే అక్రమాలకు సహకరించిన అధికారుల పేర్లతో తయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారులకు  అందజేశారు.

అందరి సమక్షంలో వివరాలు అందజేస్తున్నానని.. దీనిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కాలుష్యం తగ్గించేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అయ్యన్నపాత్రుడు. ప్రతి స్కూల్, కాలేజీలో మొక్కలు నాటే విధంగా ప్రతిపాదన చేయాలన్నారు. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు 3 మొక్కలు పెంచాలని, సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.

అంతేకాదు రైతులు పొలంలో పెంచుకున్న వేప, టేకు చెట్లు కొట్టాలంటే అటవీ శాఖ అధికారులు అనుమతులు కావాలని.. గత ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన సమయంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలు, చెట్లను ఏ అనుమతితో నరికేశారో సమాధానం చెప్పాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షలకు పైగా డ్వాక్రా సంఘాల మహిళలతో మెక్కులు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు అయ్యన్నపాత్రుడు. వనమహోత్సవం ద్వారా వారందరితో ఒక్క రోజు మెుక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి నాలుగు లక్షలకుపైగా నాటిస్తామన్నారు స్పీకర్. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు చెట్లు పెంచడంపై దృష్టి సారించాలన్నారు.

About amaravatinews

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *