ఆంధ్రప్రదేశ్

ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నో టెన్షన్, జీతాలపై కూడా క్లారిటీ వచ్చేసింది!

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు. ఆ బకాయిల్ని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని.. వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు …

Read More »

మాచర్లలో పిన్నెల్లికి బిగ్ షాక్.. బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా మిగల్లేదుగా!

మాచర్ల రాజకీయం మరో మలుపు తిరిగింది.. ఊహించినట్లే మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. శుక్రవారం మున్సిపాలిటీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీలో చేరారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 16 మందితోపాటు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఓటుతో కలిపి 17కు బలం పెరిగింది. మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికకు కోరం 16 మంది ఉండటంతో.. టీడీపీ తరఫున ఛైర్మన్‌గా డిప్యూటీ ఛైర్మన్‌ పోలూరి నరసింహారావును ఎన్నుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. గత వైఎస్సార్‌సీపీ …

Read More »

తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు మృతి

తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి …

Read More »

ఏపీలోని మహిళలకు శుభవార్త.. ఉచిత గ్యాస్ పంపిణీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఎన్నో రోజులుగానో ఎదురుచూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇల్లు లేని …

Read More »

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ఉత్తర్వులు వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బదిలీలను పాత జిల్లా (ఉమ్మడి) స్థాయిలోనే నిర్వహించనుండగా.. బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగులు ఈ నెల 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బదిలీలను నిర్వహించే విభాగాలు 28న దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుంటాయి.. ఈ నెల 29 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, బదిలీ ఆదేశాలు ఇస్తారు. కౌన్సెలింగ్‌ సమయంలో …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయాల్లోని హుండీలలో కానుకలుగా వచ్చిన కెమెరాలను దక్కించుకునే అద్భుత అవకాశం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటుచేసిన హుండీల ద్వారా భక్తులు ఆ స్వామికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. శ్రీవారికి కానుకలుగా సమర్పించిన ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం ఆరు లాట్లను ఆగస్ట్ 28న వేలం వేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట్ 28న నిర్వహించే టెండర్ …

Read More »

స్పీకర్ పదవైనా వదిలేస్తా కానీ.. ఈ విషయంలో తగ్గేదే లేదు..

Ayyanna Patrudu on Narsipatnam RTC Depot land Private Lease issue: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి అయ్యన్న శైలి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ముక్కుసూటితనం, ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన స్టైల్. అయితే తాజాగా చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్తున్నా కూడా వినకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని …

Read More »

శ్రీవారి మెట్టు మార్గంలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం..

తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద ఓ మహిళ, మరో యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ సిబ్బందికి తెలియజేశారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించి.. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరినీ కిందకు దించారు. అనంతరం అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన జంటను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. దర్శన టికెట్లు, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం టోకెన్ల నవంబరు నెల‌కు సంబంధించిన కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు నేడు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల …

Read More »

మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.. క్షతగాత్రులను జార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంపై సీఎం అధికారులతో మాట్లాడారు.. …

Read More »