దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు చాలావరకు మారే అవకాశం ఉంది. …
Read More »సీఎం చంద్రబాబు పెద్ద మనసు.. వారందరికీ రూ.3 వేలు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీరు చేరి భారీగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యారు. దీంతో అక్కడ నివసించే జనజీవనం అస్తవ్యస్తం అయింది. పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలను సహాయక శిబిరాలకు తరలించింది. ఈ క్రమంలోనే వరద ప్రభావానికి గురై.. ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక …
Read More »చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే..
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన చూస్తుంటే.. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా.. రివర్స్ వెళ్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని.. బాధితులపై కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని.. ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు …
Read More »విజయవాడ దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం.. 15 రోజుల్లో ఎన్ని కోట్లంటే
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయ మహా మండపంలో లెక్కించారు. దుర్గమ్మకు 15 రోజులకుగాను రూ. 2,68,18,540 ఆదాయం నగదు రూపంలో వచ్చింది. అంటే రోజుకు సగటున రూ.17,54,569 మేరకు కానుకలు వచ్చినట్లు లెక్క. నగదులతో పాటుగా 380 గ్రాముల బంగారం, 5కిలోల 540 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయి. 401 ఓమన్ రియాల్స్, 281 అమెరికా డాలర్లు, 110 యూరోలు, 70 అస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లండ్ …
Read More »ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు
తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్..
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మచిలీపట్నం నుంచి నర్సాపురానికి కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రంం ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైలు మార్గం కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఇప్పటికే నివేదికలు సమర్పించగా.. తాజాగా ఆయన ప్రయత్నం ఫలించింది.. ఈ కొత్త లైన్‌కు కేంద్రం లైన్ క్లియర్ చేసింది. ఈ నూతన రైలు మార్గం మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా నిర్మాణం జరగబోతోంది. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందంటున్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో …
Read More »టీటీడీలోకి మరో సీనియర్ అధికారి
టీటీడీలోకి మరో కీలక అధికారి వచ్చారు.. అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి కాగా.. డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిది. దీంతో ఈ నెల 16న కేంద్రం ఆమోదం తెలపగా.. ఆయన ఈ నెల 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో పాటు తిరుమల జేఈవోగానూ విధులు నిర్వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకయ్య …
Read More »పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ …
Read More »ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 26, 2024): మేష రాశి వారికి మీ దగ్గర బంధువుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) పిల్లల చదువుల మీద …
Read More »అసెంబ్లీలో వారందరినీ నిలబెట్టిన సీఎం..
ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. సీరియస్‌గా మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో సభలో నవ్వులు విరిశాయి. అంతేకాదు సభలోని మెజారిటీ సభ్యులు లేచి నిల్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు మాటతో వారంతా లేచి నిల్చోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగిందనే సంగతికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అనే అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు. …
Read More »