ఆంధ్రప్రదేశ్

దేశ, విదేశాల కరెన్సీ.. 33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..

నేటికి కరెన్సీ సేకరణ ముమ్మరంగా కొనసాగుతుందని వినొద్ చెప్పారు.. భారత దేశ చరిత్రలో కరెన్సీ చలామణిలో అతి తక్కువ విలువ కలిగి పేరుగాంచిన బొట్టు, అణాతో పాటు దమ్మిడి, పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ,పది పైసల నుంచి 1000 కాయిన్ వరకు నాణేలు సేకరించినట్లు తెలిపారు..కరెన్సీ సేకరణ ఆయన హాబి. అందుకే ఆయన అందరికంటే భిన్నంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.. కర్నూలు ఆత్మకూరు పట్టణానికి చెందిన దేవరశెట్టి వినోద్ కుమార్ అనే వ్యక్తి విభిన్నంగా ఆలోచించి కరెన్సీని 33 సంవత్సరాలుగా …

Read More »

APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా.. ఎందుకంటే

APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా పడింది. వాస్తవానికి జనవరి 1 నుంచి నిర్ణయం అమలు చేయాలని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని విషయంపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా …

Read More »

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

Ind vs Aus 4th Test Match: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియాకు మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో తెలుగు యువకుడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) సెంచరీతో అదరగొట్టాడు. ఆసిస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచిరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు. 105 పరుగులతో అజేయంగా నిలిచి నాలుగో టెస్ట్‌లో భారత్‌ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు.బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా …

Read More »

పవన్ మన్యం పర్యటనలో అంతా తానై వ్యవహరించిన IPS.. ఆ తర్వాత సంచలన నిజం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 20న జరిగిన ఏపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు సుమారు 1500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ టూర్‌కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యామ్, జిల్లా ఎస్‌పి మాధవ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే..డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో …

Read More »

సంక్రాంతికి ఊరెళ్లేవారికి అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది

సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికోసం సొంత గ్రామాలకు వెళ్లేందుకు అందరూ సిద్ధం అవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ మహానగరం సగానికిపైగా ఖాళీ అయిపోతుంది. మరి దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ ఏయే ప్రణాళికలు చేసిందంటే..ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారి కోసం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి …

Read More »

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. త్వరలో వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లు రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ లభ్యమవుతాయంటే..

తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శనివారం నిర్వహించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యకమాల గురించి భక్తులకు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేశామని చెప్పారు.వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు …

Read More »

క్లాస్ రూమ్‌లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు

తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్‌తో ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఉమామహేష్‌ను అదుపులోకి తీసుకొని తిరుపతి రూరల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు.టెంపుల్ సిటీలో ఆచార్యుడి వక్రబుద్ధి బయట పడింది. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర …

Read More »

కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత

పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల పొడవుతో భయానకంగా ఉన్న కింగ్ కోబ్రా పెద్ద పెద్దగా బుసలుకొడుతూ జన్ని రాముపై దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురయ్యాడు. పొలం పనిలో నిమగ్నమైన గిరిజనుడికి ఎదురైన ఈ ఘటన స్థానికులను సైతం గగుర్పాటుకు గురి చేసింది.జన్ని రాము ప్రతిరోజు పొలం పనులకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే రాము ఉదయాన్నే జీడి మామిడి తోటకెళ్లి …

Read More »

హనీట్రాప్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!

విశాఖ హనీట్రాప్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని సూచించారు. మరోవైపు నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.సంచలనాలకు కేరాఫ్‌గా మారింది విశాఖ హనీట్రాప్‌ కేసు. రోజుకో అప్‌డేట్‌.. పూటకో ట్విస్ట్‌తో పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న క్రైమ్‌ కథా చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ మద్దతు ఇవ్వడం.. …

Read More »

సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకున్న రైతు కుటుంబం.. కన్నీరు పెట్టిస్తున్న నలుగురి మృతి!

అప్పుల భారం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో జరిగిందీ విషాదం. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు, 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేశాడు. అయితే అప్పుల బాధ తాళలేక పొలం దగ్గరే ఉరివేసుకుని రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రైతన్న కంట కన్నీరు ఆగడం లేదు.. ఎక్కడో ఒకచోట ఏదో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటూనే …

Read More »