23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఆమె.ఇటీవలె శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు మన తెలుగుమ్మాయి కూడా అంతరిక్ష యాత్ర చేయనుంది. అది కూడా అతి చిన్న …
Read More »శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో ఆటలు.. ఆన్‌లైన్‌లో పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్స్!
తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్‌ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేసి.. శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా …
Read More »డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ పవర్ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు. ఇక్కడ శక్తివంతమైన సర్కార్ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉంటే.. మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ పవర్ …
Read More »బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!
తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్‌కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. …
Read More »QR కోడ్ స్కాన్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి.. ఏమాత్రం తేడా ఉన్నా చర్యలే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు.. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది. దీని ద్వారా.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి అనే దానిపై స్పష్టత రానుంది. ఈ ఫారమ్‌లో పౌరులు ఇవ్వవలసిన ప్రశ్నలు/అభిప్రాయాలు ఇలా ఉంటాయి.. …
Read More »శివయ్యా ఇన్నాళ్లకు కరుణించావా..! శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం – ఎప్పటి నుంచి అంటే
శైవ భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం దేవస్థానం. రోజుకు 1000 మంది చొప్పున శ్రీశైలంలో వెలసిన జ్యోతిర్లింగ స్పర్శ దర్శనానికి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సదావకాశం గతంలో ఉన్నదే అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యలో బంద్ చేశారు. తర్వాత మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభిస్తున్నారు. ప్రతివారం మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లోనే ఈ స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే ఈ స్పర్శ దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల …
Read More »పదో తరగతి పాసైన వారికి 1294 ఆశా వర్కర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా (Accredited Social Health Activist) వర్కర్ల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద అన్నమయ్య జిల్లాలో మొత్తం 1294 ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు …
Read More »దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..
మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు. రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. దీంతో మరోసారి తన భూమిని విక్రయించుకునేందుకు …
Read More »మెగా డీఎస్సీ పరీక్షల కేంద్రాలు, తేదీలు మారాయ్.. కొత్త హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి మొత్తం 154 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి ఈ పరీక్షలు పూర్తి కావల్సి ఉంది. అయితే జూన్ 20,21 తేదీల్లో నిర్వహించవల్సిన పరీక్షలను అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను జులై 1, 2వ తేదీల్లో నిర్వహిచనున్నట్లు విద్యాశాఖ అప్పట్లో …
Read More »ఇవాళ్టి నుంచే రేషన్ సరుకుల పంపిణీ.. వారికి కూటమి సర్కార్ స్పెషల్ ఆఫర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్.. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేసే ప్రక్రియను 5 రోజుల ముందు నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై నెల రేషన్‌ను 5 రోజులు ముందుగానే జూన్ 26 నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో గురువారం …
Read More »