ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs) స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు. …
Read More »ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు సూసైడ్..! ఏం జరిగిందో..?
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ.. ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం (జులై 4) రాత్రి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం …
Read More »ఎలారా ఇలా.! పైకి అదొక పైనాపిల్ లోడ్ ఆటో.. లోపల చెక్ చేయగా కళ్లు తేలేశారు
బోర్డర్ ప్రాంతంలో ఓ ఆటో వస్తోంది. చూడటానికి ఏదో పైనాపిల్ లోడ్‌లా ఉంది. కానీ వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉంది. అనుమానమొచ్చి టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు దాన్ని ఆపారు. ఆ తర్వాత తనిఖి చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. గంజాయి, మత్తుపదార్ధాలు యువత దరికి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తెలివిమీరిపోయి.. పుష్ప స్టైల్‌లో యదేచ్చగా అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజాయిని అక్రమ రవాణా చేస్తోన్న ఓ …
Read More »బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో
వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటం దీనికి కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాలు మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా …
Read More »శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో స్పర్శ దర్శన టోకెన్‌లు!..
శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు, భక్తుల రద్దీ కూడా భారీ పెరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టిన ఆలయ అధికారులు …
Read More »మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ పరీక్షలు జులై 2వ తేదీలో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఒక్కొక్కటిగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతూ వస్తుంది. మిగిలిన అన్ని సబ్జెక్టుల అన్ని పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను, రెస్పాన్స్ షీట్లను జులై 3 నుంచి వెబ్‌సైట్‌లోకి అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్ అయ్యి ఆన్సర్ కీ, …
Read More »విద్యార్ధులకు అలర్ట్.. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో కీలక మార్పు! కొత్త తేదీలివే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. నిజానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ జులై 17 నుంచి ప్రారంభంకావల్సి ఉంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల …
Read More »శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించగా.. ఆశ్చర్యకరంగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆ విగ్రహాలు జాగ్రత్తగా భద్రపరిచి.. పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఓ అరుదైన పురాతన శిల్ప సంపద వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శివాలయ అభివృద్ధి పనుల సమయంలో తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు స్థానికులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేశాయి. గురువారం శివాలయ పరిసరాల నుంచి మట్టిని తొలగించి …
Read More »కమిషనర్ వద్దకు వచ్చిన బిక్షాటన చేసే బాలురు – ఏం అడిగారో తెలిస్తే మీ మనసు చివుక్కుమంటుంది
సారూ మాకు చదువు చెబుతారా! అంటూ భిక్షాటన చేసుకునే ఇద్దరు బాలురు కమిషనర్‌ను వేడుకున్న దృశ్యం అందర్నీ చలించేలా చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ ‘మీకు తెలిసిన పెద్దవారిని తీసుకొచ్చి, పాఠశాలలో చేరండి’ అంటూ తన ఫోన్ నంబరును వారికి ఇచ్చి పంపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ గురువారం వీఆర్ విద్యాసంస్థల ప్రాంగణాన్ని సందర్శించగా ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన బిక్షాటన చేసే అనాథ బాలురు పెంచలయ్య, వెంకటేశ్వర్లు “సార్ మాకూ చదువు చెబుతారా?” అంటూ …
Read More »ఇంటి ముందు నిమ్మకాయలు కనపడగానే ఉన్మాది అయ్యాడు – సొంత పిన్ని అని కూడా చూడకుండా
చిల్లంగి నెపంతో మహిళను దారుణంగా హతమార్చాడో కిరాతకుడు. సొంత పిన్ని నన్ను వదిలిపెట్టరా, నీకు పుణ్యం ఉంటుందని అర్థించినా పైశాచికంగా కత్తిపీటతో వెంటాడి వేటాడి హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది. బొబ్బిలి పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ దారుణ హత్యకు గురైంది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో నుంచి తీవ్ర గాయాలతో పెద్దపెద్ద కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అలా పరిగెత్తుతూ ఇంటి వెలుపల ఉన్న గుమ్మం వద్దకు వచ్చి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో, …
Read More »