శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.
Read More »రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. వారందరికీ బిగ్ రిలీఫ్
ఏపీలో వరద పరిహారం ఇంకా అందనివారికి బిగ్ రిలీఫ్.. వివిధ కారణాల వలన వరద పరిహారం అందని వారికి సోమవారం పరిహారం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం రూ.602 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే చాలా మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమైంది. అర్హులైన వారిలో ఇప్పటి వరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. …
Read More »బెజవాడ దుర్గమ్మకు మంగళసూత్రం చేయించిన సామాన్య భక్తుడు.. రూపాయి, రూపాయి కూడబెట్టి
విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఓ సామాన్య భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెడుతూ.. పోగు చేసిన సొమ్ముతో 203 గ్రాముల బంగారం కొని అమ్మవారికి మంగళసూత్రం తయారుచేయించి తీసుకొచ్చాడు. ఆ హారం విలువ రూ. 16.50 లక్షల విలువ ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అమ్మవారి భక్తుడైన అంకులయ్యా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేల తన కానుకను సమర్పించి మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి శనివారం (అక్టోబర్ 5) దుర్గగుడికి వచ్చి మంగళసూత్రాలను …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు చంద్రబాబు శుభవార్త.. టీటీడీకి కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన టీటీడీ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని.. కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు అన్నారు. ఈ విషయంలోనూ రాజీ పడొద్దని.. ప్రసాదాల నాణ్యత మరింత మెరుగపడాలని సూచించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు చంద్రబాబు. టీటీడీ సేవలపై …
Read More »ఏపీకి, విజయవాడవాసులకు కేంద్రం శుభవార్త.. చంద్రబాబు రిక్వెస్ట్‌తో వాటన్నిటికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడకు కేంద్రం తీపికబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో విజయవాడతో పాటుగా అమరావతికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు దక్కాయి. తాజాగా విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కి.మీ. మేర సూపర్‌స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుల్ని ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టులకు రూ.12,029 …
Read More »నాగార్జున హీరో కాదు విలన్.. ఆ ఒక్క కారణంతోనే మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు: తీన్మార్ మల్లన్న
తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్ర సీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే.. ఈ …
Read More »తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు …
Read More »కోర్టులు, చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వారాహి డిక్లరేషన్ విడుదల, ముఖ్యాంశాలివే!
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన, కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి …
Read More »ఏపీలో ఆరోగ్యశ్రీ రద్దు.. లెటర్ కూడా, అసలు సంగతి ఏంటంటే!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (ఆరోగ్య శ్రీని) రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఓ లెటర్ కూడా వైరల్ అవుతోంది.. కొంతమంది దీనిని ట్వీట్, పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని తొలగిస్తున్నట్టు షేర్ చేస్తున్న జీవో ఫేక్. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం’ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కొనసాగుతుందని క్లారిటీ …
Read More »నేటి అలంకారం శ్రీ గాయత్రీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండోరోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ఆశ్వయుజ శుద్ధ విదియ, శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండోరోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ముఽఖాలతో, ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో, శిరస్సున చంద్రరేఖతో, దశ హస్తాలలో ఆయుధ- ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకూ …
Read More »