ఆంధ్రప్రదేశ్

కంత్రిగాళ్ల పని ఖతం.. రంగంలోకి ఖాకీల త్రినేత్రం!.. కంట పడ్డారో మీపని గోవిందా!

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థను అప్‌డేట్‌ చేయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారు. సమాజంలోకి ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇలానే ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఏలూరు జిల్లా పోలీసులు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడిని పట్టుకున్నారు. జిల్లాకు చెందిన పాత నేరస్థులను పట్టుకునేందుకు ఏలూరు జిల్లా పోలీసులు ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నేరస్థులను గుర్తించేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ఫేస్‌రికగ్నిషన్ ఫీచర్‌ కలిగిన సీసీ కెమెరాలను …

Read More »

నేటి నుంచి శ్రీవారి దర్శనం మరింత సులభం..! ఆగస్టు నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వదినాలు ఇవే..

ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ కోటా కింద టిక్కెట్లు కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టిక్కెట్లను, విమానాశ్రయంలో 200 టిక్కెట్లను అందిస్తుంది. ఇకపోతే, ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్‌ను …

Read More »

ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ నెల్లూరు పర్యటన.. భారీగా తరలివచ్చిన జనాలు!

జగన్‌ పర్యటనతో నెల్లూరు హాట్‌ ల్యాండ్‌గా మారింది. గత పర్యటనలో కనిపించిన సీన్స్‌ మళ్లీ కనిపించాయి. పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్‌ పర్యటనలో ఉద్రిక్తతలు నెకొన్నాయి. జగన్‌ను చూసేందుకు భారీగా వచ్చిన జనాలు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చదంగా వచ్చే ప్రజలపై లాఠీ చార్జ్‌ చేయడమేంటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున జనం, కార్యకర్తలు …

Read More »

తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు

శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి 3 రోజుల సమయం పడుతోంది. ఇకపై ఏ రోజు టికెట్‌ తీసుకుంటే ఆరోజే దర్శనానికి టీటీడీ వీలు కల్పించనుంది. భక్తుల వసతికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ …

Read More »

మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి.. తెలంగాణ నుంచి పోటీలో నిలిచి కిరీటం దక్కించుకున్న ఏపీ మహిళ!

అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళ మిస్సెస్ ఇండియాగా నిలిచింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డిగారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి వ్యవసాయ కుటుంబం నుంచి మిస్సెస్ ఇండియా అయ్యింది. ఢిల్లీలో వీఆర్‌పీ ప్రొడక్షన్స్ నిర్వహించిన సీజన్ 5 పోటీల్లో విజయలక్ష్మి మిస్సెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పీసీఎల్ డీలర్‌గా ఉంటుంది. హైదరాబాద్ SBI లో …

Read More »

మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన అభిమానాన్ని, అనురాగాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో పలు గిరిజన గ్రామాల్లో సందర్శించిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో రానున్న చలికాలంలో వాళ్లు పడే ఇబ్బందులను గుర్తించి సుమారు ఆరు గ్రామాలకు తన సొంత డబ్బుతో దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన అభిమానాన్ని, అనురాగాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇకపై ఖాళీలకన్నా 200 రెట్లు ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. చాలా పోస్టులకు ఒకే మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక పూర్తవుతుంది. దీంతో నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని, నిరుద్యోగుల ఖర్చు భారం తగ్గుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా, నియామకాల్లో వేగం పెరిగేలా నూతన మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. …

Read More »

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్‌ను మీరూ చూశారా.?

మరో ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ఆగష్టు 15 నుంచి ప్రారంభించనుంది. దానికి సంబంధించిన వివరాలు.. ఫ్రీ టికెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా. సూపర్ సిక్స్‌లో భాగంగా ఒక కీలకమైన పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ప్రయాణ ఖర్చును తగ్గిస్తూ, ఆర్థిక భారం తక్కువ చేయాలన్న లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 15 నుంచి …

Read More »

 సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితమేంటి? ఏపీకి ఎంత పెట్టుబడి వస్తుంది? బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? బలహీనమైన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? పెట్టుబడుల అంచనాలు ఎంతవరకు వెళ్లాయి? దీన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య, ఆర్ధిక వ్యూహంగా చూస్తే.. ముఖ్యమంత్రి పర్యటనతో రాష్ట్రానికి వచ్చే బెనిఫిట్ ఎంత? ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశాలు ఇవే. చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య శాఖ మంత్రి టాన్ సీ లెంగ్, హోం …

Read More »

పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!

సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండని ఆయా కంపెనీల సీవోలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా సీఎం వారికి వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో …

Read More »