ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ …
Read More »చదువు ‘కొన’లేక చంపేశాడు.. ప్రొఫెషనల్ కిల్లర్‌లా.. కాకినాడ కేసులో కొత్త విషయాలు..
కాకినాడ లో మూడు మరణాలు కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు.. పక్కా ప్లాన్ ప్రకారం చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలను చంపి , తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. దానికి కావలసిన తాళ్లు ముందుగానే రెడీగానే ఉంచుకున్నాడు చివరిగా భార్యకి మిస్ యు అని మెసేజ్ చేశాడు.కాకినాడలో హోలీ పండుగ రోజు విషాదం జరిగింది. ఓఎన్జిసి ఉద్యోగి చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలు జోషిల్,నిఖిల్‌లను కసాయిగా మారి కడతేర్చాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత కొడుకులను ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌లాగా …
Read More »అమరావతికి మరో తీపికబురు.. ఇకపై రాజధాని పనులు మరింత వేగం..
అమరావతి నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నవ్యాంధ్ర రాజధానికి రుణం అందించేందుకు హడ్కో ముందుకు వచ్చింది. ఈ నిధులతో ప్రభుత్వం ఏమేం పనులు చేయబోతోంది? రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా.. అమరావతి పరుగులు పెడుతోంది. వీలైనన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు బ్యాంక్‌లు, సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తోంది. తాజాగా మరో …
Read More »ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?
మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర …
Read More »మళ్లీ మళ్లీ చెప్పను..! అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ స్వీట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంతమంది సభ్యులు సభలో కూర్చోనే ఫోన్లలో మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించే అసెంబ్లీలో మొబైల్ ఫోన్లను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత సంభాషణల్లో నిమగ్నమవుతుండటం తగదంటూ సభ్యులను సున్నితంగా హెచ్చురించారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. సభా …
Read More »హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకించాను! మరోసారి భాషా వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. డీఎంకే నేతలు కూడా స్పందిస్తూ హిందీని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేశారు.హిందీ భాషా గురించి కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాంటిదేం లేదని కేంద్ర …
Read More »మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తమది ప్రజా ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి, మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ …
Read More »అది వ్యతిరేకించడం కాదు..! పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్..! జనసేనానికి ప్రకాశ్ రాజ్ కౌంటర్
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకతను ఆయన ప్రస్తావించగా, తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదని, అన్ని భాషలకు ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు, ప్రకాష్ రాజ్ వంటి వారు కౌంటర్ ఇచ్చారు.జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశంలోని అన్ని భాషలు అవసరం అని, హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్లు వాళ్ల సినిమాలను …
Read More »డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …
Read More »NTR Trust Merit Scholarship Test 2025కు దరఖాస్తులు ఆహ్వానం.. మరో పది రోజుల్లోనే పరీక్ష!
యూపీఎసస్సీ యేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. నిరుపేద విద్యార్ధులు కోచింగ్ తీసుకునే స్థోమతలేని వారి కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అద్భుత అవకాశం అందిస్తోంది. అదేంటంటే.. ఈ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ 2025 పరీక్ష ద్వారా..ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ 2025 పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ …
Read More »