ఆంధ్రప్రదేశ్

అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. ఆ వార్తలపై TTD సీరియస్

టీటీడీ మాజీ పీఆర్వో నిష్కా బేగం ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. నిష్కా బేగం అనే వ్యక్తి ఎవరూ గతంలో టీటీడీ పీఆర్వోగా పనిచేయలేదని స్పష్టంచేసింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వైసీపీ …

Read More »

శత్రు దుర్భేద్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టుతూ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటికే ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా, ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ కీలక భూమిక పోషించనున్నాయి. ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ ఎలా పనిచేయబోతున్నాయి …

Read More »

AP School Syllabus: 9, 10 తరగతుల్లో హిందీ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయోచ్.. పాఠశాల విద్యాశాఖ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల హిందీ సిలబస్ మారనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల హిందీ సిలబస్ ను మార్చి గతంలో రద్దు చేసిన రాష్ట్ర సిలబస్‌ని తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈ తరగతుల్లో NCERT సిలబస్ అమలు చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు తరగతుల సిలబస్‌లో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. జాతీయ విద్య …

Read More »

జవహర్‌ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. పరీక్ష ఎప్పుడంటే?

2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ జనవరి 18, ఏప్రిల్ 16 తేదీల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పరీక్షకు సంబంధించిన పరీక్ష మాత్రం జనవరి 18వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మలి విడత పరీక్ష ఏప్రిల్ 16వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తవగా అడ్మిట్ కార్డులు సైతం విడుదలయాయి. విద్యార్ధుల రిజిస్ట్రేషన్‌ నంబరు, పుట్టినతేదీ …

Read More »

ఆర్టీసీ బస్సులో అనుమానంగా కనిపించిన బాక్స్.. తీసి చూస్తే కళ్లు జిగేల్, కళ్లుచెదిరేలా!

నిత్యం లక్షలాదిమంది జనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు మాత్రం హడావిడిలో డబ్బులు, బంగారం వంటి వాటిని అక్కడే వదిలేసి బస్సును దిగిపోతుంటారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు వాటిని గుర్తించి జాగ్రత్త చేస్తున్నారు.. ఉన్నతాధికారులతో కలిసి తిరిగి వాటిని పోగొట్టుకున్నవారికి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ నెల 4వ తేదీన …

Read More »

ఆ జిల్లాకు సూపర్ న్యూస్.. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్.. 4 వేల ఎకరాలు లీజుకు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. టీడీపీ కూటమి సర్కారు చర్యల కారణంగా.. పలు కీలక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం కనిగిరిలో 4000 ఎకరాల బంజరు భూమిని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లీజుకు ఇవ్వనున్నారు. గురువారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమికి ఎకరాకు ఏడాదికి 15 వేలు …

Read More »

 ఆంధ్రాలో తాజా వెదర్ రిపోర్ట్.. వచ్చే 3 రోజులు ఇలా

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. అలాగే మరోవైపు చలి పులి చంపేస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు దట్టంగా అలుముకుంది. స్థానికంగా మినుములూరు, అరకులో 12 డిగ్రీలు.. పాడేరులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణ ఎఎమ్మెల్యే, ఎంపీల తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. వారానికి 2 బ్రేక్‌ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమితించనున్నారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక …

Read More »

భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? వారి సంపద ఎంతో తెలుసా?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు.భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద రూ.1,630 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా …

Read More »

సముద్ర తీరంలో తాబేళ్ల మృత్యుఘోష.. ఒడ్డుకు కొట్టుకువచ్చిన అరుదైన జాతి తాబేళ్ల కళేబరాలు

సముద్ర తీరప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మొన్న కోస్తా తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తే.. నిన్న ప్రకాశం జిల్లాలో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల మరణాలకు అరికట్టేందుకు.. అరుదైన జీవాలను కాపాడేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.కోస్తాతీరం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆలివ్‌ రిడ్లీ జాతికి చెందిన పెద్ద పెద్ద తాబేళ్లు పదుల సంఖ్యలు మృత్యువాడ పడ్డటం ఆందోళన కలిగిస్తోంది. ఒడ్డుకు కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలను …

Read More »