ఆంధ్రప్రదేశ్

ఏపీలో మహిళలకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి, లేకపోతే పథకం రాదు!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమైంది.. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు, విధి విధానాలను రూపొందించి వివరాలన వెల్లడిస్తారు. ఏపీలో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉండాలంటే.. ముందుగా ఈ-కేవైసీ …

Read More »

ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. అయితే కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి అంటున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ అల్లూరి …

Read More »

టీడీపీ ఎంపీ ఇంట తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి. పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్‌ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. …

Read More »

విజయవాడ వరదలో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు నష్టపోయారా.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు అపార నష్టాన్న మిగిల్చాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వరద దెబ్బకు ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు, ఈ వరదల్లో ముఖ్యంగా ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. …

Read More »

తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఏర్పాటు.. ఆయనకే చీఫ్ బాధ్యతలు, మరో ఇద్దరు IPSలు

తిరుమలలో లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. ప్రధానంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, ఇతర అక్రమాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిట్‌ చీఫ్‌గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సిట్‌లో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో పాటు తిరుపతి అడ్మిన్‌ ఏఎస్పీ వెంకట్రావు, అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌, మరికొంతమంది డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి …

Read More »

ఏపీలో వారందరికి ఉద్యోగాలు.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ల కామన్‌ పూల్‌లోని ఖాళీల్లో నియమించే అంశంపై.. రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్‌ ఉద్యోగులు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయులు మరణిస్తే.. వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్‌ …

Read More »

ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.25వేలు, రూ.10వేలు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాలు, వరద బాధితులకు నేడు సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ప్యాకేజీని అందజేస్తోంది. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పలువురు వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందజేస్తారు. ఈ 4 లక్షలమందిలో విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది బాధితులు ఉన్నారు. ఇవాళ ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను బాధితులకు సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేయనున్నారు. అలాగే ఇళ్లు, షాపులు, వాహనాలు, పంటలు, పశువులు, తోపుడు …

Read More »

ఏపీలో తొలి వందే మెట్రో.. ఆ రూట్లో పరుగులు..!

రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తేనుంది. తాజాగా వందే మెట్రో పేరుతో తక్కువ దూరం ఉండే నగరాల మధ్యన నడిపేలా కొత్త రైలును కూడా ప్రవేశపెట్టారు. గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్యన దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. …

Read More »

పిలిచి సీటిచ్చిన వైఎస్ జగన్‌కు షాకిచ్చిన కృష్ణయ్య.. అసలు కారణాలు ఇవేనట..

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామా చేసిన కృష్ణయ్య లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు. మరోవైపు ఆర్. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ …

Read More »

టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

Read More »