ఆంధ్రప్రదేశ్

తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …

Read More »

ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. “ఇది మంచి ప్రభుత్వం” పేరుతో కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 6రోజుల పాటు ఈ “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో …

Read More »

మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిలు.. సినిమా రేంజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఒక్కడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల కొట్లాట చర్చనీయాంశమైంది. మచిలీపట్నానికి చెందిన విజయ్ అనే బిల్డర్‌‌పై అనూష అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో విజయ్ అనే బిల్డర్‌ ముందు అనూష అనే మహిళను ప్రేమిస్తున్నానని చెప్పాడని.. అయితే ఆరు నెలలుగా తనతో ఉండం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తన డబ్బులు, బంగారం తీసుకున్నాడని.. అడిగితే తననే బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ అనిత అనే మరో మహిళత కలిసి ఉంటున్నాడని.. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక.. తాను అక్కడికి వెళ్లి …

Read More »

విమానాశ్రయాల్లో సరికొత్త విధానం.. ఇకపై సెకెన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి!

విమానాశ్రయాల్లో మరింత వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ప్రయోగాత్మకం చేపట్టిన ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ప్రధాన 20 ఎయిర్‌పోర్టులకు దీనిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకెన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 22న ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌ (FTI-TTP)ను కేంద్ర …

Read More »

విశాఖవాసులకు టీటీడీ అద్భుత అవకాశం.. ప్రతిరోజూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఎక్కడంటే!

విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి …

Read More »

కదిరి: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్.. ఏమైందంటే

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో బ్రష్‌లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది. బ్రష్ దవడలో అలాగే ఇరుక్కుపోగా.. వెంటనే తల్లిదండ్రుల్ని బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్‌ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

Read More »

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పిన్నెల్లికి మరోసారి ఆ బాధ్యతలు, వరుసగా రెండోసారి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్. ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. జిల్లాలవారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అధినేత జగన్ కీలక బాధత్యలు అప్పగించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. అంతకముందు కూడా పిన్నెల్లి ఆ బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్‌ మళ్లీ నియమించారు. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు, …

Read More »

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా?. కొద్దిరోజులుగా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్‌ గొప్పగా చెప్పుకొనే వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసింది అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లతో ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని.. ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించినట్లు వివరించారు. ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని.. మిగిలినవారి పదవీకాలం ముగిసింది అన్నారు. వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయలేదని.. …

Read More »

ఏపీ ప్రభుత్వం నుంచి లోన్‌ తీసుకున్న మహిళా మంత్రి.. ఎందుకో తెలుసా?, ఎంత తీసుకున్నారంటే!

ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు. మంత్రి సొంత కారు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల రుణం మంజూరు అయ్యింది. ఆ మొత్తాన్ని మంత్రి సంధ్యారాణి వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం మినహాయించుకుంటుంది. మంత్రి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులు ప్రభుత్వం నుంచి ఇలా లోన్ తీసుకుని.. జీతంలో నుంచి మినహాయించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చంద్రబాబు …

Read More »

ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …

Read More »