ఉపాద్యాయులపై విద్యార్దుల ఫిర్యాదు చేశారు. సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ డీఈవోకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.సైన్స్ పాఠాలు చెప్పడం లేదంటూ ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. స్కూల్‌కు వస్తున్నాం కానీ పాఠాలు వినడం లేదని, ఉపాధ్యాయులు పాఠాలు చెబితే ఎందుకు వినమని విద్యార్థులు ఉన్నతాధికారులకు రాసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.. మాకు పాఠాలు చెప్పండి మహా ప్రభో అంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆ పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్దులు ఆశ్రయించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలంలోని …
Read More »తెలుగోళ్ల సత్తా.. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి 90 మందికిపైగా అర్హత! పూర్తి లిస్ట్ ఇదే
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను డిసెంబర్ 9న సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదికి మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై …
Read More »తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్ కొలువులకు ఉచిత కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సర్కార్ కొలువు దక్కించుకోవాలనేది ఎందరికో కల. కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది. ఇందుకు గల అనేకానేక కారణాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఒకటి. అయితే ఒక్క రూపాయి చెల్లించకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలోనే నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉచితంగా శిక్షణ పొందవచ్చు..కేంద్ర సాయుధ బలగాల్లో బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి …
Read More »ఇక ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లకు దబిడిదిబిడే.. కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే విధంగా బడుల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన టీచర్ల స్థానంలో ఇతర ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయని. ఇలా ఒకరికి …
Read More »గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. పరీక్షలు యథాతథం
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదాను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. గ్రూప్ 2 పరీక్ష, ఆర్ఆర్బీ పరీక్ష ఒకే రోజు ఉండటంతో గ్రూప్ 2ను రీషెడ్యూల్ చేయాలని పేర్కొంటూ సుమారు 22 మంది అభ్యర్ధులు పిటీషన్లు దాఖలు చేయగా.. వీటిని విచారించిన కోర్టు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనందున వాయిదా వేయలేమంటూ..తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హాల్ టికెట్లు కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని …
Read More »ఏఐ జమానా.. ఎగబడి కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులు
2024-25 అకడమిక్ సెషన్‌లో 4,538 పాఠశాలల నుండి దాదాపు 7,90,999 మంది విద్యార్థులు సెకండరీ స్థాయిలో (IX , X తరగతులు కలిపి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో (XI, XII తరగతులు కలిపి), 944 పాఠశాలల నుండి 50,343 మంది విద్యార్థులు AIని ఎంచుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. AI విద్య యొక్క ప్రాముఖ్యతను కేంద్రమంత్రి జయంత్ చౌదరి వివరించారు. 2019లో …
Read More »ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు ‘తెలుగు సబ్జెక్ట్’ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు
SSC మినహా మిగతా బోర్డులకు సంబంధించిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నిబంధనను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని, 9, 10 తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది..తెలంగాణ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ప్రస్తుత (2024-25), వచ్చే విద్యా సంవత్సరం (2025-26) తొమ్మిదవ, పదో తరగతి చదివే విద్యార్ధులు …
Read More »ఫిబ్రవరి 23న గురుకుల 5వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు మరో పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్ వర్షిణి తెలిపారు..తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 18వ తేదీన విడుదలకానుంది. ఈ మేరకు గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఉమ్మడి ప్రవేశ …
Read More »మరింత ఆలస్యం కానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు.. కారణం ఇదే
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాలు, పోస్టుల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమం నిర్వహించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తొలుత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిపారు. ఆ తర్వాత గ్రూప్-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల మాదిరిగాకాకుండా ఫలితాలను మాత్రం రివర్స్ విధానంలో విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధం అవుతుంది. అంటే తొలుత గ్రూప్ …
Read More »వికారాబాద్ కుర్రోడి సత్తా.. రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు
తెలంగాణ కుర్రోడు దిగ్రజ వ్యాపార సంస్థ అమెజాన్ లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో చదువుకుని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ లో ఉన్నత కొలువు దక్కడంటై గ్రామస్థులతో పాటు, తల్లిదండ్రులు సైగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు..తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఏకంగా గ్రోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఏడాదికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో కొలువు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఆఫర్ లెటర్ కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఉద్యోగంలో …
Read More »