విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎందుకంటే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. విద్యార్థులకు ఒక సెలవులు వస్తున్నాయంటే చాలు తెగ సంబరపడిపోతుంటారు. అలాంటిది ఏకంగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతులేస్తారు. మరి ఈ మూడు రోజుల సెలవులు ఎందుకు రానున్నాయో చూద్దాం..
సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు పండగే. ఫిబ్రవరి 14, 15,16 తేదీలలో సెలవులు వస్తున్నాయి.ఇక ఉద్యోగులు ఆదివారం కాకుండా వారంలో ఇంకో ప్రత్యేక సెలవేదైనా వచ్చిందో ఇక ఎంజాయ్ అనే చెప్పాలి. ఇలా ఒక్కరోజు సెలవు వస్తేనే విద్యార్థులు, ఉద్యోగులు సంబరపడిపోతుంటారు. అలాంటిది వరుసగా మూడు రోజులు సెలవు వస్తే ఎగిరిగంతేస్తారు విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 14,15, 16 మూడురోజులు సెలవులు వుండే అవకాశం కనిపిస్తోంది.
ఫిబ్రవరి 14 (శుక్రవారం) సెలవు :
ఇదిలా ఉంటే తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగానే ఉంది. దీంతో వారి పండగలకు ప్రభుత్వం సెలవు ఇస్తుంది. ఫిబ్రవరి 14న కూడా షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించకపోయినా.. దాదాపు చాలా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలకు ఫిబ్రవరి 14న తప్పకుండా సెలవు ఉండనుంది. ఇక మిగతా శాఖలకు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది.
వాలైంటైన్స్ డే
ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే దినోత్సవం. ఆరోజు ఆప్షనల్ హాలిడే ఉండటం కాలేజీ యువతకు కలిసిరానుంది.
ఫిబ్రవరి 15 (శనివారం) సెలవు :
ఇక ఫిబ్రవరి 15న (శనివారం) బంజారాలు ఆరాధ్యదైవంగా కొలిచే సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. గతంలో బంజారాలు కూడా ఈ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఇప్పుడు కూడా అలాగే సెలవు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు బంజారాలు.
ఫిబ్రవరి 16 (ఆదివారం) సెలవు:
ఇక 16న ఆదివారం. సాధారణంగా సెలవు ఉంటేంది. దీంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.