ఎడ్యుకేషన్

 ఏపీలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది.. రెండు గుడ్‌న్యూస్‌లు ఇచ్చిన సర్కార్

అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేజీ టూ పీజీ కరికులంలో ఇకపై మార్పులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందని అన్నారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ డేను ఘనంగా …

Read More »

పేదరికాన్ని జయించి.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గిరిజన యువతి..!

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటేనే గగనం.. అలాంటిది గిరిజన తండాకు చెందిన ఓ యువతి, ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్ట, నష్టాలకు ఒడ్చి.. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందీ గిరిజన యువతి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూల తండా నుంచి మెరిసింది ఈ గిరి పుత్రిక. ఒకే సారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఆదివాసీ ముద్దుబిడ్డ …

Read More »

Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వీటి ద్వారా ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుందన్నారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన ఏడు నవోదయ విద్యాలయాలు జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో …

Read More »

టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ.. తొలిరోజే మాస్‌ వార్నింగ్‌!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై పరీక్షల వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తొలగించుకోండంటూ.. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ తన కల అన్నారు. …

Read More »

విదేశాల్లో న్యూ ఇయర్ కి వెల్కం చెప్పాలనుకుంటున్నారా.. వీసా ఫ్రీ దేశాలు ఇవే..

పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీసా రహితంగా పర్యటించే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నూతన సంవత్సర సమయం వేళ మీరు కూడా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే భారతీయ పౌరులు వీసా లేకుండా పర్యటించే అందమైన దేశాల గురించి తెలుసుకుందాం..డిసెంబర్ నెలలో అడుగు పెట్టాం దీంతో నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సన్నాహాలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆశ.. కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కొంతమంది తమ కుటుంబంతో ఇంట్లోనే ఉంటూ ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటారు. అయితే …

Read More »

సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్‌ విద్యార్ధులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇంటర్‌ బోర్డు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణ ఆదిత్య ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో …

Read More »

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తర్వాతే ఈఏపీ సెట్‌ 2025 పరీక్ష.. వెనక్కి తగ్గిన ఉన్నత విద్యామండలి?

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌ 2025) పరీక్షను ఈసారి కాస్త ముందుగానే జరపాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఈఏపీ సెట్‌ 2025 నిర్వహించనున్నట్లు గతంలో తెల్పింది కూడా. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కి తెల్పినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలలో జరగనున్న …

Read More »

ఏపీపీఎస్సీలో వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మొత్తం నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. అయితే ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, అనలిస్ట్‌ గ్రేడ్‌-2, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలను కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ వెల్లడించారు. ఏయే …

Read More »

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం, ఎంపికైన …

Read More »

దారుణం.. ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య..! కాలేజీ యామన్యాలపై అనుమానాలు

తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్న తరుణంలో ఒకే రోజు ఇద్దరు విద్యార్ధుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారాయి. వివరాల్లోకెళ్తే.. అన్నోజిగూడ నారాయణ జూనియర్ కాలేజీలో ఉరి పెట్టుకుని ఒకరు.. బీబీనగర్‌ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌ నాయక్‌ (16) అనే విద్యార్ధి అన్నోజిగూడలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ) చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన …

Read More »