ఎడ్యుకేషన్

 ‘త్వరలోనే టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాం’.. సీఎం రేవంత్‌

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గ్రూప్‌ 1 తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌ 1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. 563 మంది గ్రూప్‌ 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఏవిధమైన …

Read More »

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పరీక్షల టైమ్‌ టేబుల్‌ను రూపొందించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు సమాచారం. ఈ …

Read More »

స్కూల్‌ విద్యార్థులకు షాక్‌.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు? ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు షాకింగ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్‌ ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. రేపే మాపో అధికారిక టైం టేబుల్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్‌ …

Read More »

ఉద్యోగుల శిక్షణకు స్వదేశీ ఫ్రేమ్‌వర్క్‌.. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా..

ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలపై కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుందనే దానిపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘భారతదేశ భవిష్యత్తును నిర్దేశించడానికి ప్రధాని మోదీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాము. ప్రధాని మోదీ చెప్పిన వికాస్‌, గర్వ, కర్తవ్య, ఐక్యత అనే నాలుగు సందేశాలను గుర్తించాము. ఈ నాలుగు తీర్మానాలను సాధించడానికి, ప్రభుత్వ అధికారులు…స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి స్వదేశీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. 2047 నాటికి విక్షిత్‌ భారత్‌ అనే మోదీ గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఆధునిక బ్యూరోక్రసీకి శిక్షణ …

Read More »

CAT 2024 Result Date: క్యాట్ 2024 ‘కీ’ విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) 2024.. నవంబర్‌ 24న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం 170 న‌గ‌రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష ఆన్సర్‌ కీ డిసెంబర్‌ 3న విడుదలకానుంది. అభ్యంతరాలు డిసెంబర్‌ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్‌ నెలాఖరు లేదా వచ్చే ఏడాది జనవరి …

Read More »

స్కూల్‌ విద్యార్ధులకు అలర్ట్.. సీసీఈ మార్కుల విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే

రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మూల్యాంకన విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీసీఈ మార్కుల్లో విద్యాశాఖ మార్పులు చేసి.. కొత్త విధానాన్ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో నూతన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో మార్కుల విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ క్రమంలో గతంలో ఉన్న విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. గతంలో రాత పరీక్షకు 20 మార్కులు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 35 మార్కులకు మార్చింది. ఫార్మెటివ్‌ …

Read More »

రక్తపు వాంతులతో కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి.. కొడుకు మృతిపై తల్లిదండ్రుల అనుమానం!

కాకతీయ హాస్టల్‌లో విద్యార్థి మృతిపై నిరసనగా..నిజామాబాద్‌లో ఆందోళనకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు. కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్‌లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం(నవంబర్ 29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప అస్వస్థతకు గురైన శివజశ్విత్ రక్తపు వాంతులతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులకు అలస్యంగా సమాచారం ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో తమ కుమారుడి మరణం సహాజ మరణం కాదని, …

Read More »

మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

పీజీ మెడికల్ సీట్ల స్కామ్‌లో. అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది. తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. ఇందులో మాజీమంత్రి మల్లారెడ్డి కాలేజీకి చెందిన 2.89 కోట్లు, ఎంఎన్‌ఆర్‌ మెడికల్ కాలేజీకి చెందిన 2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన 3.33 …

Read More »

అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు..

అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్‌లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్‌ వెలుపల అక్రమంగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున …

Read More »

తెలంగాణలో రేపు స్కూళ్లు బంద్.. కారణం ఇదే

తెలంగాణలో సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ బాలిక మృతి చెందగా.. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఇప్పుడు స్టేట్ లెవల్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ఆందోళనల పర్వం కొనసాగుతోంది, ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల ఫుడ్ పాయిజన్ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా …

Read More »