ఇప్పటి వరకూ క్వశ్చన్ పేపర్ల లీకేజీలు కాలేజీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తరించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ఘట్టం కూడా పూర్తించారు లీకు రాయుళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సమ్మెటివ్ 1 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమ్మెటివ్ 1 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం (డిసెంబర్ 16) గణిత సబ్జెక్ట్ పరీక్షలు జరిగాయి. అయితే పరీక్ష సోమవారం ప్రారంభంకాక ముందే గణితం ప్రశ్నపత్రాలు లీక్ …
Read More »తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందంటే..
తెలంగాణ ఇంగర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష షెడ్యూల్ సోమవారం (డిసెంబర్ 16) విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు …
Read More »డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం
ముంబైలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. …
Read More »జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు.. డిప్యూటీ సీఎం భట్టి
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి కూడా సర్కార్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు విభాగాలు, శాఖల్లో ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి.. ఆ ప్రకారంగానే టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. …
Read More »తొలిరోజు గ్రూప్ 2 పరీక్షకు భారీగా డుమ్మా.. 46.30 శాతం మంది మాత్రమే హాజరు!
ఎన్నో సంవత్సరాల తర్వాత భారీగా కొలువుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష తొలిరోజు కనీసం సగం మంది కూడా పరీక్షకు హాజరుకాకవపోవడం చర్చణీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్ 2 పోస్టులకు తీవ్ర పోటీ ఉంటుంది. దరఖాస్తులు ఐదున్నర లక్షలు వచ్చినా.. వీరిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం విశేషం.. తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే రాతపరీక్షలు డిసెంబరు 15న ప్రారంభమవగా.. డిసెంబర్ 16వ తేదీతో …
Read More »విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడిః రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్‌లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని, సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి సర్వేల్‌లో సంక్షేమ పాఠశాలను ప్రారంభించారని …
Read More »రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు.. షూ ధరించిన వారికి నో ఎంట్రీ!
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1368 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరగనుంది. 5,51,847 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు..తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ …
Read More »తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచో తెలుసా.?
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుపై రెండు సార్లు గడువు పెంచిన అధికారులు.. వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నారు. 2025 మార్చిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు దాదాపు అధికారులు నిర్ణయానికి వచ్చారు. మార్చి చివరి నాటికి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా మార్చి 3 తేది నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి దాదాపు 15 నుంచి 20 …
Read More »నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. ఇంటర్న్‌షిప్ గడువు తేదీ ఇదే
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే నీట్ పీజీ పరీక్ష 2025 తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ 15వ తేదీన నీట్ పీజీ 2025 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ఆ పరీక్షకు హాజరుకావాలనుకునే వారు వచ్చే ఏడాది జులై 31వ తేదీ నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి …
Read More »SSC Time Table 2025: టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తొలుత ప్రకటించగా.. సరిగ్గా అదే రోజున …
Read More »