తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచో తెలుసా.?

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుపై రెండు సార్లు గడువు పెంచిన అధికారులు.. వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నారు. 2025 మార్చిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు దాదాపు అధికారులు నిర్ణయానికి వచ్చారు. మార్చి చివరి నాటికి ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా మార్చి 3 తేది నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం తీసుకుంటుంది. దీంతో మార్చి చివరికి పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

పబ్లిక్ పరీక్షల కంటే ముందే నిర్వహించాల్సిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను ఫిబ్రవరిలోనే పెట్టాలే నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించేలా తేదీలతో కూడిన షెడ్యూల్ మరోవారంలో విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 3 నాటికి ఎలాంటి అదనపు రుసుం లేకుండా ఫీజు చెల్లించే గడువు ముగిసింది. జనవరి 2 వరకు 2000ల రూపాయల జరిమానాతో ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు.

ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టిన ఇంటర్ బోర్డు.. పరీక్షల షెడ్యూల్ ఇచ్చి రివిజన్ కి వెళ్లే పనిలో పడింది. మరోవైపు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ , టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇవ్వడంతో తెలంగాణలో ఎప్పుడు ఇస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. దీంతో వేగవంతంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

About Kadam

Check Also

అయ్యో! ఎంతపని చేశావమ్మా.. అవమానంతో ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య!

మాటిమాటికీ పోలీసులు ఇంటికి రావడం.. అనుమానం, దర్యాప్తు పేరిట భర్తను అరెస్ట్ చేయడం, ఇంట్లో సోదాలు చేయడంతో ఆ ఇల్లాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *