ఎడ్యుకేషన్

టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది.. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. …

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా టాప్‌.. రేపట్నుంచి రీకౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌కు ఛాన్స్!

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైనాయి. తాజా ఫలితాల్లో ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (77.59 శాతం) టాప్‌లో నిలిచింది. సెకెండ్ స్థానం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్ధులు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో ఫస్ట్ ములుగు జిల్లా (80.12 శాతం), రెండో స్థానం ఆసిఫాబాద్ …

Read More »

ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు. హాల్‌ టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ బోర్డు అధికారక తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …

Read More »

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలవనున్నాయి. వీటితోపాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫలితాలు కూడా బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ‘మనమిత్ర’ (వాట్సాప్‌), లీప్‌ (ఎల్‌ఈఏపీ) మొబైల్‌ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో …

Read More »

10వ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షా ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది..

ఏపీ స్టేట్ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇది విద్యార్థుల జీవితాల్లో మలుపు తిప్పే రోజు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉంచబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్లు, వాట్సాప్‌లో మన మిత్ర అనే సదుపాయం, అలాగే లీప్ యాప్ ద్వారా …

Read More »

మెగా డీఎస్సీ రాత పరీక్షలో నార్మలైజేషన్‌ అమలు.. దీనితో లాభమా? నష్టమా?

What is Normalization? రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ రావడంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. అయితే అంతలోనే మరో బాంబ్ విద్యాశాఖ పేల్చింది. అదేంటంటే.. డీఎస్సీ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇందులో నార్మలైజేషన్‌ అమలు చేయనున్నట్లు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక …

Read More »

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు…కమాన్‌, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

ఇంటర్ ఫలితాలు విడుదల ఆ రోజే.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. …

Read More »

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు బిగ్‌షాక్‌.. నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష నియామకాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చినా.. కొందరు అభ్యర్ధులు హైకోర్టును సంప్రదించారు. దీంతో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయమని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించరాదని సూచించింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు …

Read More »

మొన్న MBBS.. నేడు ఇంజనీరింగ్‌.. ప్రాంతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాల ముద్రణ షురూ!

గతంలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలు, మెడికల్ విద్యను ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజినీరింగ్‌ విద్యలోనూ పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే కార్యచరణ ప్రారంభించారు కూడా. తద్వారా ప్రాథమిక, హైస్కూల్‌ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో …

Read More »