ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్ 1న …
Read More »తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13న పాలిసెట్ 2025 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలిసెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక పాలీసెట్ ఫలితాలు ఈ …
Read More »ఏపీ ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ అర్హతతో బీటెక్‌లో అడ్మిషన్
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యాసంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల …
Read More »బిగ్ అలర్ట్.. రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు! మొత్తం ఎంత మంది అప్లై చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు రేపటితో (మే 15తో) ముగియనుందని, అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి నియామక నోటిఫికేషన్ ఇదే. కాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల …
Read More »ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానంలో ఓఎంఆర్ ఆధారితంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. క్వాలిఫైయింగ్ టెస్ట్ జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు 2వ తేదీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1), మ్యాథమెటిక్స్ (పేపర్-2) పరీక్షలు జూన్ 3న, జనరల్ ఫారెస్ట్రీ-1 (పేపర్-3), జనరల్ ఫారెస్ట్రీ-2 (పేపర్-4) పరీక్షలు జూన్ 4వ …
Read More »వాయిదా వేసిన సీఏ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్.. మే 16 నుంచి పునఃప్రారంభం
దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో..ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల …
Read More »టెన్త్ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్
రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది.. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. …
Read More »ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఛాన్స్!
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైనాయి. తాజా ఫలితాల్లో ఫస్టియర్ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 శాతం, ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (77.59 శాతం) టాప్‌లో నిలిచింది. సెకెండ్ స్థానం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్ధులు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో ఫస్ట్ ములుగు జిల్లా (80.12 శాతం), రెండో స్థానం ఆసిఫాబాద్ …
Read More »ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ బోర్డు అధికారక తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని …
Read More »పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. రేపే పబ్లిక్ పరీక్షల ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలవనున్నాయి. వీటితోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్‌ఈఏపీ) మొబైల్ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో …
Read More »