క్రీడలు

ఐసీసీ బిగ్ షాక్‌.. యూఏఈతో మ్యాచ్‌కు నో చెప్పిన పాక్.. గ్రూప్ ఏ నుంచి సూపర్-4 చేరే జట్లు ఇవే?

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కరచాలన వివాదం తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మ్యాచ్ రిఫరీని తొలగించాలని డిమాండ్ చేసింది. డిమాండ్ నెరవేర్చకపోతే, UAEతో మ్యాచ్ ఆడబోమని బెదిరించింది. పాకిస్తాన్ UAEతో ఆడకపోతే ఏమి జరుగుతుందో చూద్దాం. ఐసీసీ తన డిమాండ్‌ను అంగీకరించకపోతే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత, ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. సరైన నిర్ణయం తీసుకోకపోతే గ్రూప్ ఏలో యుఏఈతో జరిగే మిగిలిన మ్యాచ్‌లో …

Read More »

గ్రేట్ మేడమ్.. 4 నెలల్లో 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల

బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థులను ఓడించిన గుత్తా జ్వాల.. ఇప్పుడు తల్లి పాలతో పసిపాపలకు ప్రాణం పోస్తోంది. నాలుగు నెలల్లో 30 లీటర్ల పాలు దానం చేసి అరుదైన సేవ అందించిన జ్వాల.. ప్రస్తుతం రోజూ 600 ml పాలు ప్రభుత్వ ఆస్పత్రుల శిశువులకు పంపుతోంది. బ్యాడ్మింటన్ కోర్టులో షాట్లు కొడుతూ ప్రత్యర్థులను మట్టికరిపించిన గుత్తా జ్వాల.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం మరింత గొప్ప పోరాటం చేస్తోంది. ఆమెకు ఇది మెడల్ గెలిచే పోటీ కాదు. ప్రాణాలను కాపాడే పోరాటం. గత నాలుగు నెలల్లో, …

Read More »

297 శాతం పెరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంత వస్తాయో తెలిస్తే షాకే..

మహిళల ప్రపంచ కప్ 2025 కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ చీఫ్ జై షా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైజ్ మనీని ఏకంగా 297 శాతం పెంచి $13.88 మిలియన్లకు పెంచారు. మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం, ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ మనీని 297 శాతం పెంచింది. ఐసీసీ చీఫ్ జై షా మహిళల ప్రపంచ కప్ బహుమతి డబ్బును 13.88 మిలియన్ …

Read More »

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి వెళ్లిన క్రీడా ప్రోత్సాహకాలను రిలీజ్‌ చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయడంలో రాష్ట్రంలోని క్రీడా కారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌ రవినాయుడు …

Read More »

హైలెవెల్ కరప్టెడ్ అసోసియేషన్‌.. దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో.. ఏళ్ల తరబడి ఇదే దందా!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వివాదాలకు కేరాఫ్‌గా మార్చిన కారణాల్లో క్రికెట్‌ క్లబ్బులదీ కీలక పాత్రే. కొందరు బడాబాబులు క్లబ్బుల పేరుతో HCAలో తిష్టవేసుకుచి కూర్చున్నారు. అసలు ఈ క్లబ్బుల గోల ఏంటంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది తెలంగాణలో ఉన్న ఈ 217 క్లబ్బులే. ఒక్కో క్లబ్‌కి ఒక్కో ఓటు. అందుకే, హెచ్‌సీఏ రాజకీయం అంతా వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. HCA.. హైలెవెల్ కరప్టెడ్ అసోసియేషన్‌.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అనగానే.. ‘దారితప్పిన, అవినీతిమయమైన సంఘం’ అనే ట్యాగ్‌లైన్‌ ఇస్తారు గానీ.. ఎంత ఖ్యాతి ఉండేదో …

Read More »

లార్డ్స్ మైదానంలో మూడో టెస్ట్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ.. ఆనందంతో చిందులేస్తున్న ఫ్యాన్స్

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి లండన్‌లో ఉన్నారు. ఇటీవల ఈ స్టార్ జంట వింబూల్డన్ 2025 లో జరిగిన ఒక హై-ప్రొఫైల్ టెన్నిస్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. అక్కడ విరాట్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ కు సపోర్ట్ ఇస్తూ కనిపించాడు. మీడియా నివేదికల ప్రకారం, విరాట్-అనుష్క లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంటున్నారు. వింబూల్డన్ మ్యాచ్‌లు లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్‌లో జరుగుతున్నాయి. ఇది …

Read More »

టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ‘కెప్టెన్ కూల్’ ఎం.ఎస్. ధోనీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1981లో బీహార్‌లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్‎కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ …

Read More »

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌‌కు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది కేంద్రం. అలాగే …

Read More »

పోలీస్ ఆఫీస్ ఎదుట సూర్య నమస్కారాలు..ఆకట్టుకుంటున్న శిల్పాలు.. ఆవిష్కరించిన ఎస్పీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపిలో ప్రతి చోట యోగాసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వినూత్న ఆలోచనకు రూపం వచ్చింది. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖాళీ స్థలం ఉంది ఎంతో కాలంగా అక్కడ మట్టి పేరుకుపోయి ఉంది. అయితే ఎస్పీ సతీష్ కుమార్ అక్కడ అరుదైన శిల్పాక్రుతిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.పోలీసులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రతి రోజూ డ్రిల్ చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా ప్రతి రోజూ లా అండ్ …

Read More »

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం

సురేందర్, నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆర్మీ, బీఎస్ఎఫ్ లో చేరాలనే కలతో ఉన్నాడు. అయితే ఆ కల నెరవేరకపోవడంతో, ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో శిక్షణ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అతని కృషికి ముఖ్యమంత్రి కూడా అభినందనలు తెలిపారు.ఆర్మీలో చేరాలనుకున్నా.. అదృష్టం వరించలేదు. బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం చేయాలనుకున్నా.. కాలం కలిసిరాలేదు. అయినా ఏదో సాధించాలనే తపన ఆ యువకుడిలో ఏమాత్రం తగ్గలేదు. అనూహ్యంగా రైఫిల్‌ షూటింగ్‌ రంగాన్ని ఎంచుకుని.. …

Read More »