చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా విలువైన వస్తువులను దొంగతనం జరగడం గురించి విన్నాం. వీళ్లు మాత్రం వేరే రేంజ్.. చికెన్ షాపులను మాత్రమే టార్గెట్ చేస్తారు.. దర్జాగా ఆటోలో వస్తారు.. చికెన్ షాపు బయట కనిపించే కోళ్లను తస్కరిస్తారు. కోళ్లను మెల్లగా ఆటోలో వేసుకుని జారుకుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కోళ్ల మాయమవుతండటంతో అనుమానం వచ్చిన యాజమానులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు వ్యవహారం బయటపడింది.ఎవరైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలిస్తారు. …
Read More »ముంబై దాడుల సూత్రధారి.. గ్లోబల్ టెర్రరిస్ట్.. అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి!
ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బావ, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్. మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.మోస్ట్ వాంటెడ్ లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు. మక్కీ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి డిప్యూటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. హఫీజ్ మహ్మద్ సయీద్‌కు హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ దగ్గర బంధువు. …
Read More »ఆ మూడు మృతదేహాలపై బలమైన గాయాలు.. ఇంతకీ ఆత్మహత్యలా.. హత్యలా?
మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలేవరకు వెళ్లింది. గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు ఉండటం.. చెరువు గట్టుపై వీరి వస్తువులన్నీ ఉండటం.. అసలింతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే డైలమాలో పడేశాయి..ఒకే సమయంలో.. ఒకేచోట.. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఒక …
Read More »తమిళనాడులో విద్యార్థినిపై లైంగిక దాడి యత్నం.. రాజకీయంగా రచ్చ రేపుతోన్న తాజా ఘటన..
మహిళలపై జరిగే లైంగిక దాడి ఘటనలు ఒక్కోసారి ప్రభుత్వాలను ఇరకాటంలో పడేస్తుంటాయి. తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఇలాంటి ఘటనతో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అందరూ చూస్తుండగానే ఓ కామాంధుడు విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడం ఘటనలో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం పట్ల విపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన ఇప్పుడు రాజకీయంగా రచ్చ రేపుతోంది. నగరంలోని తామరై ప్రాంతాల్లో ఉన్న అన్నా యూనివర్సిటీలో ఓ యువతి మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలోని …
Read More »హిజ్రాలతో సన్నిహితంగా కుమారుడు.. తల కొట్టేసినట్లు అనిపించడంతో.. అతని పేరెంట్స్..
ఒక్కడే కొడుకు.. ఆస్తులు లేకున్నా.. రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును బీటెక్ చదివించారు. అయితే అతను మాత్రం తప్పుడు మార్గంలో పయనించాడు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారలేదు. పైగా అమ్మనాన్నలనే చీదరించుకున్నాడు. పెళ్లి చేయాలని, మనవళ్లు, మనవరాళ్లతో వారి ఆశలు అడియాశలే అని భావించారు. దీంతో…నంద్యాలలో ఆ దంపతులు పూలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కడే కుమారుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. రూపాయి.. రూపాయి కూడబెట్టి.. తనయుడ్ని బీటెక్ చదివించారు. అయితే చదువు పెద్దగా రాకపోవడంతో.. ఆటో కొనివ్వమని తనయుడు కోరడంతో కొనిపెట్టారు. అయితే …
Read More »నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో దొరికి పోయిందిలా!
ఇద్దరు మహిళలు తల్లీకూతుళ్లుగా నాటకాలాడి ఏకంగా ఆరుగురిని బురిడీ కొట్టించి భారీ మొత్తంలో లూటీ చేశారు. వీరికి మరో ఇద్దరు పెళ్లిళ్ల పేరయ్యలు ధనవంతులైన ఒంటరి కుర్రాలను వలేసిపట్టి పెళ్లి చేసేవారు. ఆనక యువతిని కాపురానికి పంపించి.. అవకాశం దొరకగానే ఆ ఇంట్లో బంగారు నగలు, డబ్బు తీసుకుని ఉడాయించడం ఈ రాకెట్ స్కెచ్..ఓ యువతి డబ్బున్న ఒంటరి పురుషులే లక్ష్యంగా.. ప్రేమ, పెళ్లి పేరిట ఘరానా మోసాలకు పాల్పడింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సజావుగా కాపురం చేసి, ఆనక అవకాశం దొరకగానే ఇంట్లో …
Read More »డాలర్ డ్రీమ్స్‌తో దొంగ దారుల్లో అమెరికాకు.. ఈడీ నిఘాతో వెలుగులోకి సంచలనాలు..!
డాలర్ డ్రీమ్స్‌తో యువతను దొంగ దారుల్లో అమెరికాకు పంపిస్తోన్న దళారీ ఏజెన్సీలపై ఈడీ నిఘా పెట్టింది, ముంబై, నాగ్‌పూర్ కేంద్రంగా ఈ దందా చేస్తున్నట్టు గుర్తించింది. మనీ లాండరింగ్ కేసులో పిడికిలి బిగిస్తే అక్రమచొరబాట్ల డొంక కదులుతోంది. యూనివర్సిటీలతో సహా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌ల పేరుతో దాదాపు 35,000 మంది విద్యార్థి వీసాలు పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడైంది.కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ దృష్టి సారించింది. యువత డాలర్ డ్రీమ్స్‌ను క్యాష్ చేసుకునేందుకు ఏజెంట్ మాఫియా అక్రమ …
Read More »లేడీ హోంగార్డు చేతివాటం.. 3 జిల్లాల్లో రూ. కోటి దాకా లూటీ! ధనవంతులే టార్గెట్
డబ్బున్న వ్యక్తులతో సాన్నిహిత్యంగా మెలుగుతూ, అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ పలువురిని ముప్పుతిప్పలు పెట్టి దాదాపు రూ. కోటి వరకు దండుకుంది ఓ మహిళా హోం గార్డు. ఏకంగా పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ వ్యవహరించిన తీరు ఆ శాఖకే కళంకం తెచ్చిపెట్టేలా ఉంది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. వేములవాడలో హోంగార్డుగా పనిచేస్తుండగా రాజన్న ఆలయ అనే మహిళ.. అదే జిల్లాలో ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన శేఖర్‌తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకుంది. …
Read More »అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్.. ఆంటోనితో సీన్ రీకన్‌స్ట్రక్షన్..
సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఆంటోనిని …
Read More »గురునానక్ కాలేజీలో బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్.. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు
గురునానక్ కాలేజీలో విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీగా మారింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అసలు వీళ్లు ఎక్కడికి వెళ్లారు…? ఎవరి చెప్పకుండా పారిపోయారా..? లేదంటే కిడ్నాప్‌కు గురయ్యారా..? కాలేజ్ యాజమాన్య ఏమంటుంది… పోలీసుల గాలింపు ఎలా సాగుతుంది..? డీటేల్స్ తెలుసుకుందాం పదండి…రంగారెడ్డి జల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 10రోజుల వ్యవధిలోనే ముగ్గురు అదృశ్యమవడం తీవ్రకలకలం రేపుతోంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు మిస్సింగ్ అవ్వడం అటు తల్లిదండ్రులలో, ఇటు కాలేజీ యాజమాన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు అదృశ్యమైనట్లు కళాశాల …
Read More »