జాతీయం

తెలుగు సీఎంలతో జలశక్తి శాఖ సమావేశంపై ఉత్కంఠ… బనకచర్లపై చర్చకు ససేమిరా అంటున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ దిల్లీకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. బనకచర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కోరారు. కృష్ణా, గోదావరి నది జలాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల …

Read More »

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) మరో భారీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు అసిస్టెంట్‌ సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ఇందుకు సంబంధించి షార్ట్‌ నోటీస్‌ జారీ చేశారు. విద్యార్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్‌ను జులై 19వ తేదీ ఐబీ (IB) అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.. భాతర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకి చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (Intelligence Bureau) మరో …

Read More »

కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఆయనతో పలు అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్ర సమస్యలను సీఎం కేంద్రమంత్రికి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపిపారు. అంతే కాకుండా మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షా కు, కేంద్రానికి, ప్రధానికి …

Read More »

జామపండ్లు మీకూ ఇష్టమా? జాగ్రత్త.. వీరికి విషంతో సమానం

కొద్దిగా వగరు, మరికాస్త పులుపు, ఇంకాస్త తీపి.. రుచులతో జామ పండ్లు తినేందుకు భలేగా ఉంటాయి. జూలై మొదలు సెప్టెంబర్‌ వరకు మార్కెట్లలో జామపండ్లు దర్శనమిస్తాయి. అందుకే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దాని ఆరోగ్య ప్రయోజనాలు, సరసమైన ధర కారణంగా.. జామపండ్ల సీజన్‌ వచ్చేసింది. కొద్దిగా వగరు, మరికాస్త పులుపు, ఇంకాస్త తీపి.. రుచులతో జామ పండ్లు తినేందుకు భలేగా ఉంటాయి. జూలై మొదలు సెప్టెంబర్‌ వరకు మార్కెట్లలో జామపండ్లు దర్శనమిస్తాయి. …

Read More »

చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!

బోడ కాకరకాయ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. వీటితో కర్రీ వండితే ఉండే టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకర కర్రీతో రుచి మాత్రమే కాదండోయ్, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, వర్షాకాలంలో బోడకాకర కాయ తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బోడ కాకర కాయను కూరగాయల్లోనే కింగ్ అంటారు. ఎందుకంటే చికెన్, మటన్‌లో లభించనన్ని పోషకాలు ఇందులో లభిస్తాయి. అందుకే చాలా మంది బోడ కాకర కాయ తినాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా …

Read More »

స్పేస్‌ నుంచి భూమిపైకి తిరిగొచ్చిన శుభాన్షు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుండి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అభినందించారు. ఐఎస్ఎస్ సందర్శించిన తొలి భారతీయ వ్యోమ గామిగా శుక్లా చరిత్ర సృష్టించారు. శుక్లా అంకితభావం, ధైర్యం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా శుభాన్షు శుక్లా కొత్త చరిత్ర సృష్టించాడు. తన అంకితభావం, ధైర్యం మార్గదర్శక స్ఫూర్తి …

Read More »

టెన్త్, ఇంటర్ అర్హతతో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు! ఇలా దరఖాస్తు చేసుకోండి..

న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్‌ సర్వీసెస్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్‌ సర్వీసెస్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం పదో …

Read More »

ఆమె ఉరిశిక్షను అడ్డుకోవడం కష్టమే.. సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రభుత్వం వెల్లడి!

వ్యాపార భాగస్వామిని హత్య చేసిందన్న ఆరోపణలతో యెమెన్‌ దేశం కేరళకు చెందిన నర్స్‌ నిమిష ప్రియకు ఊరిశిక్షి పడిన విషయం తెలిసిందే.. మరో 48 గంటల్లో ఆమెకు ఉరిశిక్షను అమలు చేయనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు ఎలాంటి మార్గాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది. భారత్‌-యెమెన్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేనందున ఉరిశిక్షను ఆపేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అనుకూల మార్గాలు లేవని భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరో 48 గంటల్లో ఉరిశిక్ష …

Read More »

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియా సీఈవో సంచలన కామెంట్స్..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల కలలను చిదిమేసింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటనలో 250మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదం జరిగి నెల దాటింది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త చర్చకు వస్తూనే ఉంది. ఇటీవలే విమానానికి ఇంధనం అందకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏఏఐబీ 15 పేజీలతో ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఇంధన కంట్రోల్ స్వీచ్‌లు ఆఫ్ అయ్యాయని.. పైలట్లు సైతం ఇదే విషయంపై …

Read More »

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది . గోవా గవర్నర్‌గా ఏపీకి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు. అలానే హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా  కవీందర్ గుప్తాలను రాష్ట్రపతి నియమించారు. ఈ మేరకు తాజాగా గవర్నర్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ …

Read More »